AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘12-12-12’ చిట్కాతో ఇల్లు నిమిషాల్లో క్లీన్ చేసేయండి! ఒత్తిడిని తగ్గించే మ్యాజికల్ రూల్

ఇల్లు సర్దడం అనేది ఒక అంతుచిక్కని పనిలా అనిపిస్తుందా? ఒక గది శుభ్రం చేసేలోపే మరో గది చెత్తాచెదారంతో నిండిపోతోందా? అయితే మీరు ఒంటరి వారు కాదు. చాలామంది ఎదుర్కొనే ఈ సమస్యకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఒక సింపుల్ అండ్ పవర్‌ఫుల్ టెక్నిక్ '12-12-12 మెథడ్'.

‘12-12-12’ చిట్కాతో ఇల్లు నిమిషాల్లో క్లీన్ చేసేయండి! ఒత్తిడిని తగ్గించే మ్యాజికల్ రూల్
12 12 12 Method.jpg
Nikhil
|

Updated on: Mar 08, 2026 | 8:42 AM

Share

వాషింగ్టన్ పోస్ట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ పత్రికల్లో కూడా ప్రచురితమైన ఈ పద్ధతి ఇప్పుడు ఇళ్లను స్వర్గధామంలా మారుస్తోంది. ఆమె రోజంతా ఇల్లు తుడుస్తూనే ఉంటుంది, కానీ సాయంత్రానికి మళ్ళీ ఎక్కడ చూసినా సామాన్లు చిందరవందరగా కనిపిస్తాయి. అతను ఆఫీసు నుండి రాగానే ఇంటిని చూసి విసిగిపోతుంటాడు. క్లీనింగ్ అంటేనే ఒక యుద్ధంలా భావించే వారికి ఒక సరికొత్త ఆయుధం దొరికింది. అదే 12-12-12 మెథడ్. ఇది కేవలం ఇల్లు తుడవడం గురించి కాదు, మీ జీవనశైలిని రీసెట్ చేసే ఒక చిన్న ప్రయోగం. కేవలం 36 వస్తువులతో మీ ఇంటి రూపురేఖలను ఎలా మార్చవచ్చో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

అసలు ఏంటో ఈ 12-12-12 మెథడ్?

ఈ పద్ధతి చాలా సింపుల్. ప్రతిరోజూ మీరు ఒక గదిని ఎంచుకుని, అందులో నుండి ఈ క్రింది విధంగా వస్తువులను విడదీయాలి.

  • 12 వస్తువులు పారేయండి- విరిగిపోయినవి, కాలం చెల్లినవి లేదా పనికిరాని వస్తువులను చెత్త బుట్టలో వేయండి.
  • 12 వస్తువులు దానం చేయండి- మీకు అవసరం లేనివి, కానీ ఇతరులకు ఉపయోగపడే మంచి స్థితిలో ఉన్న వస్తువులను వేరు చేసి దానానికి పక్కన పెట్టండి.
  • 12 వస్తువులను సర్దండి- గదిలో ఇక్కడక్కడ పడి ఉన్న వస్తువులను తీసుకుని వాటికి కేటాయించిన సరైన స్థానాల్లో సర్దండి.

ఎందుకు అంత ప్రభావవంతం?

మనం ఒకేసారి ఇల్లంతా సర్దాలని అనుకుంటే ఆ ఒత్తిడికి అసలు పని మొదలుపెట్టం. కానీ ఈ పద్ధతి చిన్న లక్ష్యాలతో మొదలవుతుంది. రోజుకు కేవలం 36 వస్తువులపై దృష్టి పెట్టడం వల్ల పని త్వరగా పూర్తవుతుంది. ఒక మూలలో విజయం సాధిస్తే, అది మిగిలిన ఇల్లంతా శుభ్రం చేయడానికి మీకు ప్రేరణనిస్తుంది.

ఈ పనిని మరింత సులభతరం చేయడానికి మూడు వేర్వేరు డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా వస్తువును తీసేయాలా వద్దా అని సందేహం వస్తే మీ స్నేహితుడి సహాయం తీసుకోండి. కొన్నిసార్లు మనం కేవలం అలవాటు కొద్దీ పనికిరాని వస్తువులను అట్టిపెట్టుకుంటాం. విలువైన వస్తువులైతే ఆన్‌లైన్‌లో అమ్మేయండి, కానీ అవి త్వరగా అమ్ముడుపోకపోతే దానం చేసేయడమే మేలు. ఆ వస్తువులను ‘మళ్ళీ చూద్దాంలే’ అని ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ పాత గజిబిజి మొదలవుతుంది.

ప్రయోజనాలు..

ఇల్లు శుభ్రంగా ఉంటే కేవలం చూడటానికి బాగుండటమే కాదు, మన మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తక్కువ వస్తువులు ఉంటే క్లీనింగ్ పని తగ్గుతుంది, తద్వారా సమయం ఆదా అవుతుంది. అనవసరమైన గందరగోళం లేకపోతే మనస్సు ప్రశాంతంగా ఉండి, పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాదు, మీ దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో మీకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి అనవసరంగా మళ్ళీ మళ్ళీ వస్తువులను కొనే ఖర్చు తప్పుతుంది. 12-12-12 మెథడ్ అనేది మీ ఇంటిపై మీ నియంత్రణను తిరిగి తెచ్చుకునే మార్గం. చిన్న అడుగులతోనే పెద్ద మార్పులు సాధ్యం.

Follow Us