AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: క్యాష్ ఉందనుకుని సంచి ఎత్తుకెళ్లిన దొంగలు.. తీరా విప్పి చూడగా మైండ్ బ్లాంక్!

వారు ఒకటి అనుకుంటే.. చివరికి దేవుడు మరొకటి తలిచాడు. క్యాష్ ఉందనుకుని కష్టపడి సంచి దొంగలిస్తే.. దాన్ని విప్పి చూసి నోరెళ్ళబెట్టారు.

Viral: క్యాష్ ఉందనుకుని సంచి ఎత్తుకెళ్లిన దొంగలు.. తీరా విప్పి చూడగా మైండ్ బ్లాంక్!
Representative Image
Ravi Kiran
|

Updated on: Jul 14, 2022 | 1:15 PM

Share

”ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందే.. నాకే అనుకుంటే.. అది నీకూ జరిగిందే..” అనే పాట మీకు గుర్తు ఉంటుంది. సరిగ్గా ఇక్కడ ఇద్దరు దొంగల పరిస్థితి ఇదే అయింది. వారు ఒకటి అనుకుంటే.. చివరికి దేవుడు మరొకటి తలిచాడు. క్యాష్ ఉందనుకుని కష్టపడి సంచి దొంగలిస్తే.. దాన్ని విప్పి చూసి నోరెళ్ళబెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ నెల 7వ తేదీన ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఉన్నావ్ గేట్ సమీపంలో నివసిస్తున్న రవి అనే వ్యక్తి రాత్రి సమయంలో ఓ సంచి పట్టుకుని బైక్‌పై బయల్దేరాడు. సరిగ్గా స్థానిక బాలాజీ రోడ్డులోకి అతడు ఎంటర్ అయ్యేసరికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అతడి బైక్ ఆపి.. తన దగ్గర ఉన్న బ్యాగ్ అప్పగించాలని బెదిరించారు. సదరు యువకుడు ఆ బ్యాగ్‌లో ఎలాంటి నగదు లేదని చెప్పినా వినకుండా సంచిని ఎత్తుకెళ్ళిపోయారు ఆ దొంగలు. ఇక చేసేదేమిలేక రవి పోలీసులను ఆశ్రయించాడు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే క్రమంలో అతడు చెప్పిన విషయం విని ఖాకీలు దెబ్బకు ఖంగుతిన్నారు.

తన కుక్కపిల్లకు అనారోగ్యం చేస్తే.. వైద్యం నిమిత్తం ఓ సంచిలో పెట్టుకుని బైక్‌పై ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని.. మార్గం మధ్యలో దుండగులు అడ్డుకుని ఆ సంచిని ఎత్తుకెళ్ళారని రవి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. కాగా, రవి చెప్పింది విని పోలీసులే ఖంగుతింటే.. నగదు అనుకుని బ్యాగ్ విప్పి చూసిన దొంగలకు ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…

Follow Us
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?