PM Modi: డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంలో అభివృద్ధికే చోటు.. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ

Bundelkhand Expressway – PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.14,850 కోట్లతో 296 కిలోమీటర్ల మేర నిర్మించిన నాలుగు లేన్‌ల అత్యాధునిక బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే (Bundelkhand Expressway) ను ప్రధాని ప్రారంభించారు.

PM Modi: డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంలో అభివృద్ధికే చోటు.. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ
Pm Narendra Modi
Follow us
Basha Shek

|

Updated on: Jul 16, 2022 | 3:51 PM

Bundelkhand Expressway – PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.14,850 కోట్లతో 296 కిలోమీటర్ల మేర నిర్మించిన నాలుగు లేన్‌ల అత్యాధునిక బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే (Bundelkhand Expressway) ను ప్రధాని ప్రారంభించారు. ఈ మేరకు జ‌లౌన్ జిల్లాలోని కైథేరి గ్రామంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ (CM Yogi Adityanth) పాల్గొన్నారు. కాగా ఈ ప్రతిష్ఠాత్మక రహదారి యూపీలోని ఏడు జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.15,000 కోట్లు. అయితే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ-టెండరింగ్‌ను ఎంచుకోవడం ద్వారా దాదాపు రూ.1,132 కోట్లు ఆదా చేసింది. కాగా 2020 ఫిబ్రవరి 29న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేశారు. కేవలం 28 నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తైంది. 296 కి.మీ విస్తరించి ఉన్న ఈ ఎక్స్ ప్రెస్ వే షెడ్యూల్ కంటే ఎనిమిది నెలల ముందే పూర్తవడం గమనార్హం. ఈ ప్రతిష్టాత్మక ఎక్స్‌ప్రెస్ వే చిత్రకూట్, బండా, మహోబా, హమీర్‌పూర్, జలౌన్, ఔరైయా, ఇటావా జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే చిత్రకూట్ జిల్లాలోని భరత్‌కప్, ఆగ్రా- ఇటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామం వరకు విస్తరించి ఉంది. దీనిని లక్నోఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానంగా నిర్మించారు.

గత ప్రభుత్వాలు మోసం చేశాయి..

ఈ సందర్భంగా ప్రారంభోత్సవంలో ప్రసంగించిన మోడీ.. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి మాత్రమే ఉంటుందన్నారు. బుందేల్‌ఖండ్ భూమికి ఈ ఎక్స్‌ప్రెస్‌వే ను బహుమతిగా అందించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఇక్కడి వాహనాలకు వేగాన్ని అందించడమే కాకుండా మొత్తం బుందేల్‌ఖండ్ పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి గత ప్రభుత్వాలు మిమ్మల్ని మోసం చేశాయని, కానీ మా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం మిమ్మల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని మోడీ వ్యాఖ్యానించారు.

ఊపందుకున్న కారిడార్‌ పనులు..

కాగా బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ, చిత్రకూట్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. 9-10 గంటల నుంచి కేవలం ఆరు గంటలకు తగ్గిస్తుంది. రాబోయే ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్ట్ విజయవంతానికి బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే కూడా కీలకం. కాగా.. ఇప్పటికే.. బందా, జలౌన్ జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని పశ్చిమ, మధ్య, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో 5,071 హెక్టార్లలో రూ.20,000 కోట్లతో డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. రాష్ట్రంలో 3,200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 13 ఎక్స్‌ప్రెస్‌వేలలో ఏడింటిలో ఆరు పనులు కొనసాగుతున్నాయి. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలకు అనుసంధానంగా పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తున్నారు.

మరిన్ని జాతీయవార్తల కోసం క్లిక్ చేయండి..