Army Jobs 2022: భారత ఆర్మీలో ఉద్యోగాలకు సదావకాశం.. ఈ అర్హతలుంటే రాత పరీక్షలేకుండానే ఎంట్రీ..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ (Indian Army).. ఆర్మీ డెంటల్ కార్ప్స్ పోస్టుల (Army Dental Corp Posts) భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
Indian Army Army Dental Corp Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ (Indian Army).. ఆర్మీ డెంటల్ కార్ప్స్ పోస్టుల (Army Dental Corp Posts) భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 30
పోస్టుల వివరాలు: ఆర్మీ డెంటల్ కార్ప్స్ పోస్టులు
ఖాళీల వివరాలు:
- పురుషులు: 27
- స్త్రీలు: 3
వయోపరిమితి: డిసెంబర్ 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీడీఎస్/ఎండీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET 2022) పరీక్ష రాసి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.200
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 14, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.