No Words Banned: ‘ఏ పదాన్ని నిషేధించలేదు.. తప్పుడు ప్రచారాలు చేయకండి’: లోక్‌సభ స్పీకర్‌

అన్‌పార్లమెంటరీ పదాల జాబితాపై తీవ్ర రాజకీయం దుమారం లేవడంతో దీనిపై స్పష్టతనిస్తూ.. పదాలపై ఎటువంటి నిషేధం విధించడంలేదని గురువారం (జులై 14) సాయంత్రం లోక్‌సభ స్పీకర్‌ ప్రకటించారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు వినియోగించే పదాల్లో..

No Words Banned: 'ఏ పదాన్ని నిషేధించలేదు.. తప్పుడు ప్రచారాలు చేయకండి': లోక్‌సభ స్పీకర్‌
Lok Sabha Speaker
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 14, 2022 | 6:35 PM

No words banned in Parliament: అన్‌పార్లమెంటరీ పదాల జాబితాపై తీవ్ర రాజకీయం దుమారం లేవడంతో దీనిపై స్పష్టతనిస్తూ.. పదాలపై ఎటువంటి నిషేధం విధించడంలేదని గురువారం (జులై 14) సాయంత్రం లోక్‌సభ స్పీకర్‌ ప్రకటించారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు వినియోగించే పదాల్లో ఏ పదాన్ని ఉపయోగించకుండా నిషేధించలేదని, కొన్ని పదాలను మాత్రమే తొలగించామని, తొలగించిన పదాల సంకలనం మాత్రమే జారీ చేశామని, సభా సౌలభ్యాన్ని కొనసాగిస్తూ సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సందర్భంగా తెలిపారు.

బిర్లా ఇంకా ఈ విధంగా మాట్లాడారు.. ‘గతంలో అన్‌పార్లమెంటరీ పదాల జాబితాను పుస్తకం రూపంలో విడుదల చేసేవారు. పేపర్లు వృథా కాకుండా ఉండేందుకు ఇంటర్నెట్‌లో పెట్టాం. ఎలాంటి పదాలను నిషేధించలేదు, తొలగించిన పదాల సంకలనాన్ని విడుదల చేశామని బిర్లా స్పష్టతనిచ్చారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కును ఎంపీల నుంచి ఎవరూ లాక్కోలేదని అన్నారు. పార్లమెంటరీ పద్ధతులపై ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. తొలగింపు కోసం ఎంచుకున్న పదాలను అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా ఉపయోగిస్తున్నారని, ప్రతిపక్షాలు మాత్రమే ఉపయోగించే పదాలను సెలెక్టివ్‌గా తొలగించ లేదని, నిషేధిత పదాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని’ విపక్షాలను ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి

కాగా పార్లమెంట్‌లో వినియోగించకూడని పదాలను నవీకరించే ప్రయత్నంలో లోక్‌సభ స్పీకర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన కొత్త బుక్‌లెట్‌ ప్రకారం. ‘జుమ్లజీవి, దోహ్రా చరిత్ర, బాల్ బుద్ధి, స్నూప్‌గేట్’ వంటి పదాలు లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ ‘అన్‌పార్లమెంటరీ పదాలు’గా ప్రకటించబడ్డాయి. వీటితోపాటు ‘అరాచకవాది, శకుని, తనషా, తానాషాహి, నియంతృత్వం, జైచంద్, ఖలిస్తానీ, వినాష్ పురుష్, ఖూన్ సే ఖేతీ వంటి పదాలు కూడా కొత్త బుక్‌లెట్‌లో చేర్చబడ్డాయి. ఈ విధమైన పదాలు చట్టసభల్లో ప్రయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగించడం జరుగుతుంది.