Monsoon Rains: జలవిలయంలో భారతం.. జమ్ముకశ్మీర్ నుంచి కేరళ వరకు..
Monsoon Heavy Rains: భారీ వర్షాలకు మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. నాసిక్ పట్టణం మొత్తం స్తంభించిపోయింది. త్రయంబకేశ్వర ఆలయ పరిసరాలు జలదిగ్బంధంలో..
దేశ వ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. వర్షాకాలం ఆరంభంలోనే వరుణుడు దంచి కొడుతున్నాడు. భారీ వర్షాలకు మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. నాసిక్ పట్టణం మొత్తం స్తంభించిపోయింది. త్రయంబకేశ్వర ఆలయ పరిసరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయ్. కొండచరియలు విరిగిపడటంతో నాసిక్-గుజరాత్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జలవిలయంలో రిస్క్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. గుజరాత్‌లో ఓ ట్రాక్టర్ డ్రైవర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. వరద ప్రవాహంలో నుంచి ట్రాక్టర్‌ను పోనివ్వడంతో కొట్టుకుపోయింది. ఈ ఇన్సిడెంట్ నుంచి డ్రైవర్‌తోపాటు మరొకరు సేఫ్‌గా బయటపడ్డారు.
అటు గుజరాత్‌లోనూ వరదలు వణికిస్తున్నాయి. కుండపోత వర్షాలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయ్. వల్సాద్ జిల్లాలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు NDRF బృందాలు
కేరళలో 2018 నాటి వరద పరిస్థితి రిపీటౌతుందన్న భయం కనిపిస్తోంది. ఎర్నాకులంలో ఈదురుగాలులకు చెట్లు, ఇళ్లు ఊగిపోతున్నాయి. ఇల్లు దాటి బైటికి రాలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు జనం.
#WATCH | Kerala: Rainfall lashes parts of Kottayam pic.twitter.com/wNuIlWWDFP
— ANI (@ANI) July 14, 2022
జమ్మూకశ్మీర్‌లోనూ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయ్. రాజౌరి జిల్లాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ధ్వంసమైంది. దాంతో, నడుము లోతు నీటిలో వాగును దాటుతున్నారు రాజౌరి ప్రజలు
గుజరాత్‌లో ఆరు జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అహ్మదాబాద్‌లోనూ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వరదల్లో చిక్కుకున్న 3వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
#GujaratFloods | Three rivers- Purna, Kaveri & Ambika, flowing through the Navsari dist are in flood situations; Purna River exceeded the danger level last night. 40,000 people affected in adjoining areas, 2500 people shifted to safe relief camps: Navsari DM Amit Prakash Yadav pic.twitter.com/nEhsfuwxYN
— ANI (@ANI) July 14, 2022
మహారాష్ట్ర భండారా జిల్లాలో ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్ భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. వరదల్లో చిక్కుకున్న 10మంది కార్మికులను సేఫ్‌గా బయటికి తీసుకువచ్చింది. అలాగే, ఓ టెంపుల్‌లో చిక్కున్న 15మంది బాధితుల్ని కూడా కాపాడారు సహాయక సిబ్బంది.
#WATCH | Maharashtra: Water-logging in various residential neighbourhoods of Chandrapur town after water was released from Irai dam in the district in the wake of incessant rainfall pic.twitter.com/XUNG9kPCWV
— ANI (@ANI) July 14, 2022
ముంబైని కూడా వర్షం వదలడం లేదు. అటు నాగ్‌పూర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. పుణెలోనూ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 14 వరకు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. జులై 14 వరకు ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, ఒడిషా, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వరద బీభత్సం తీవ్రంగా ఉంది. నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉగ్రరూపం దాల్చడంతో ఊర్లకు ఊర్లే నీట మునిగిపోయాయి.