TSWREI Recruitment 2022: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 149 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు ఇలా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ సాంఘిక, గిరిజన, ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో (TSWREIS) 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌మీడియట్, ఐఐటీ- జేఈఈ, నీట్ పరీక్షలకు కోచింగ్..
TSWREI, TTWREI Subject Associate Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ సాంఘిక, గిరిజన, ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో (TSWREIS) 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌మీడియట్, ఐఐటీ- జేఈఈ, నీట్ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీకి అనుబంధంగా.. పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టుల (Subject Associate Posts) భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 149
పోస్టుల వివరాలు: పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఖాళీల వివరాలు:
- గణితం: 26
- భౌతికశాస్త్రం: 29
- రసాయన శాస్త్రం: 32
- వృక్షశాస్త్రం: 30
- జంతుశాస్త్రం: 32
వయోపరిమితి: డిసెంబర్ 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జేఈఈ మెయిన్స్/అడ్వాన్స్‌డ్, నీట్, ఎంసెట్ శిక్షణలో కనీస అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.500
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 23, 2022.
రాత పరీక్ష తేదీ: జులై 31, 2022.
ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 8, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.www.tgtwgurukulam.telangana.gov.in లేదా www.tswreis.ac.in
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.