Viral Video: పార్కింగ్ ఏరియాలో కనిపించిన తెల్లటి ఆకారం.. ఏంటని చూడగా ఒక్కసారిగా గుండె గుభేల్!
ఆ ఇంటికి సెక్యూరిటీగా పని చేస్తోన్న సిబ్బంది అప్పుడే ఓ కునుక వేశారు. ఇంతలో సీసీటీవీ కెమెరా విజువల్స్‌లో ఓ తెల్లటి ఆకారం కనిపించింది.
అర్ధరాత్రి దాటింది. ఆ ఇంటికి సెక్యూరిటీగా పని చేస్తోన్న సిబ్బంది కూడా అప్పుడే ఓ కునుక వేశారు. ఇంతలో సీసీటీవీ కెమెరా విజువల్స్‌లో ఓ తెల్లటి ఆకారం కనిపించింది. చూసేందుకు వింతగా, భయంకరంగా ఉంది. ఏదో దొంగ ఇంట్లోకి దూరినట్లుగా నక్కి.. నక్కి మెల్లిగా ముందుకు వెళ్తోంది. చిన్న అలికిడి వినిపించి ఠక్కున నిద్ర నుంచి లేచిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ సీన్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇంతకీ ఆ కథేంటంటే.!
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని కెంటకీ రాష్ట్రం మూర్‌హెడ్ నగరంలోని ఓ ఇంటి పార్కింగ్ ఏరియాలో తెల్లటి ఆకారం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ.. ఆ ఇంటి బ్యాక్‌యార్డ్‌లో దొంగలా నక్కి.. నక్కి.. మెల్లిగా ముందుకు వెళ్లడం అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ప్రస్తుతం ఆ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జూలై 9వ తేదీన జరిగింది.
Here’s the video of the Pale creature caught on a security cam near Moorhead, KY. #cryptid pic.twitter.com/jCexxlQTA0
— Paranormality Magazine (@ParanormalityM) July 9, 2022
కాగా, ఈ వీడియోను ఇప్పటిదాకా 5.2 లక్షల వ్యూస్ రాగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కొంతమంది ఆ వింత ఆకారాన్ని చూసి ఏలియన్ అని అంటుంటే.. మరికొందరు ‘ఎవరో ప్రాంక్ చేసి ఉంటారని’ రాసుకొచ్చారు. ఒకవేళ ఆ వీడియో సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డు అయినట్లయితే.. ఎవరో విజువల్స్ తీసినట్లుగా కెమెరా ఎందుకు కదులుతోందో చెప్పాలి’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఏది ఏమైనా ఈ వీడియోకు మాత్రం నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.