YS Jagan: ఆ బాధ్యత అంతా మీదే.. YSRCP ఎమ్మెల్యేలకు సీఎం జగన్ స్వీట్ వార్నింగ్..!

ప్రజల్లో గ్రాఫ్‌ పెంచుకోవాలని, 175 సీట్లు గెలిచి తీరాలని తేల్చి చెప్పారు. మరోవైపు ప్రతి గ్రామ సచివాలయానికి రూ.20 లక్షలు ఇవ్వడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నానని, ఆ బాధ్యత తనదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు.

YS Jagan: ఆ బాధ్యత అంతా మీదే.. YSRCP ఎమ్మెల్యేలకు సీఎం జగన్ స్వీట్ వార్నింగ్..!
Cm Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 18, 2022 | 9:58 PM

CM YS Jagan on assembly elections: నేను చేయాల్సింది చేస్తున్నా, ఇక బాధ్యత అంతా మీదే.. చేసిన పని చెప్పుకుని సానుకూలత తీసుకురాకపోతే ఎవరూ క్షమించరు అంటూ పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు సీఎం జగన్‌ సున్నితంగా హెచ్చరిక చేశారు. ప్రజల్లో గ్రాఫ్‌ పెంచుకోవాలని, 175 సీట్లు గెలిచి తీరాలని తేల్చి చెప్పారు. మరోవైపు ప్రతి గ్రామ సచివాలయానికి రూ.20 లక్షలు ఇవ్వడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నానని, ఆ బాధ్యత తనదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. కొన్ని పనులతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు సాధించడం కష్టం కాదని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వరుసగా రెండో నెల వర్క్‌షాప్‌ నిర్వహించారు సీఎం జగన్‌. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించారు. ఇప్పటికీ కార్యక్రమాన్ని మొదలు పెట్టని వారు వెంటనే జనంలోకి వెళ్లాలని ఆదేశించారు. ఎవరు ఎన్ని రోజులు కార్యక్రమాన్ని చేశారన్న వివరాలను సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగానే 2024 ఎన్నికల్లో టార్గెట్‌పై మరోసారి ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్‌. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర స్థాయిలో తాను చేయాల్సింది చేస్తున్నానని, ఇక దాన్ని సానుకూలంగా మార్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందని స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి పని చేస్తేనే ఫలితం వస్తుందన్నారు సీఎం జగన్‌. స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేకంగా నిధుల్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రెండు కోట్లు, ఒక్కో గ్రామ సచివాలయానికి 20 లక్షలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నెలకు 20 రోజులు జనంలోనే ఉండాలని ప్రతి ఒక్కరికీ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్‌.

కొన్ని లక్షల మంది వైసీపీ ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నారని, వాళ్లందరికీ ఇంకా న్యాయం జరగాలంటే మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు సీఎం జగన్‌. మరోవైపు నేతల వల్ల పార్టీకి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే అలాంటి వారి విషయంలో కచ్చితంగా ఆలోచించాల్సి వస్తుందని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గడప గడపకు వెళ్లి చేసిన కార్యక్రమాలను గుర్తు చేయాలని, ఆ పనిని మరింత క్వాలిటీగా చేసినప్పుడే ఎమ్మెల్యేలు చిరస్థాయిగా ఉండిపోతారని చెప్పారు సీఎం జగన్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..