Kodali Nani: ‘గోతుల్లేని రోడ్లను దేశంలో ఎక్కడ చూపించినా రాజకీయాల నుంచి తప్పకుంటా’.. కొడాలి నాని సవాల్..
Kodali Nani: గుంతలు లేని రోడ్లను భారతదేశంలో ఎక్కడ చూపించినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని గుడివాడ ఎమ్యెల్యే, వైసీ నాయకుడు కొడాలి నాని.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు సవాలు విసిరారు...
Kodali Nani: గుంతలు లేని రోడ్లను భారతదేశంలో ఎక్కడ చూపించినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని గుడివాడ ఎమ్యెల్యే, వైసీ నాయకుడు కొడాలి నాని.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు సవాలు విసిరారు. తాడేపల్లిలో సోమవారం మాట్లాడిన నాని విపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. లక్షల రూపాయలతో రోడ్లు వేసినా 10 నుంచి 20 శాతం మేరకు గోతులు ఉండటం సహజమన్న నాని, మనదేమి అమెరికా కాదని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ గడ్డం, జుట్టుతో కనిపించే నాని.. తాజాగా డిఫ్రంట్ లుక్‌లో కనిపించారు. ఇటీవలే తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారు. గుండు, క్లీన్ షేవ్‌తో నాని భిన్నంగా కనిపించారు. అయితే ఆయన మాటల్లో మాత్రం దూకుడు తగ్గలేదు. ఎప్పటిలాగానే చంద్రబాబు, పవన్‌పై తనదైన శైలిలో ఫైరయ్యారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘వరదల్లో లంక గ్రామాలు ఇబ్బంది పడ్డాయి. ప్రభుత్వం పునరావాస ఏర్పాట్లు చేసింది. ప్రతీ వరద బాధిత కుటుంబానికి రూ. 2వేలు ఇస్తోంది. రాజకీయంగా చంద్రబాబుకి ఫుడ్డు లేదు.. పవన్, లోకేష్ లకి పాలు లేవు. దిక్కుమాలిన రాజకీయ పార్టీలు సీఎం జగన్ ను ఏమీ చేయలేరు. పశువులు, పంటలు దెబ్బ తింటే లెక్కలు తీయమని సీఎం చెప్పారు. ఈ ప్రభుత్వం మీద ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఈ పనికిరాని 420 గాళ్లకి ప్రజలే బుద్ధి చెప్తారు. రెండు రోజులు షూటింగ్ ఉండదనుకుంటా.. గుడ్ మార్నింగ్ సీఎంని మొదలెట్టాడు. ఇదేం అమెరికా, సింగపూర్, మలేషియా కాదు, అన్ని లక్షల కోట్లు పెట్టి రోడ్లేసినా పోయే రోడ్డు పోతూనే ఉంటుంది. సినిమాలు చేసుకుంటూ ఉండే వాళ్లకి గ్రామాల గురించి తెలియదు’ అని మండిపడ్డారు.
ఇక చంద్రబాబు అసెంబ్లీకి సీఎంగా వస్తా అన్న మాట మర్చిపోయాడని, భార్య గురించి అసెంబ్లీకి రానన్నాడు.. భార్యకి ఇవాళ వెన్నుపోటు పొడిచాడని దుయ్యబట్టారు. చంద్రబాబుకు భార్య కంటే ముర్ము ఎక్కువైపోయారని నాని విమర్శించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..