Alcoholic Fatty Liver: మద్యం ఫుల్లుగా తాగుతున్నారా..? ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ ప్రమాదంలో పడినట్లే..
మద్యం సేవించడం వల్ల సంక్రమించే వ్యాధులలో ఫ్యాటీ లివర్ ఒకటి.. కాలేయ కణాల చుట్టూ చాలా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కాలేయం సరిగా పనిచేయదు.
Alcoholic Fatty Liver: మద్యపానం ఆరోగ్యానికి చాలా హానికరం.. మద్యం తాగడం వల్ల శరీరం క్రమంగా దెబ్బతింటుంది. ముఖ్యంగా లివర్ చెడిపోతుందని.. దీని ద్వారా శరీరం పూర్తిగా అనారోగ్యానికి గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించడం వల్ల సంక్రమించే వ్యాధులలో ఫ్యాటీ లివర్ ఒకటి.. కాలేయ కణాల చుట్టూ చాలా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కాలేయం సరిగా పనిచేయదు. ప్రతి ముగ్గురిలో దాదాపు ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఫ్యాటీ లివర్ కారణంగా శరీరంలో అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, థైరాయిడ్ మొదలైన అనేక ఇతర సమస్యలు రావొచ్చు. ఫ్యాటీ లివర్‌లో నాన్ ఆల్కహాలిక్, ఆల్కహాలిక్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఆల్కహాల్ ఎక్కువగా మద్యం తాగడం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లక్షణాలు, నివారణ చర్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..
ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లక్షణాలు
ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లక్షణాలను గుర్తించడం, దానికి సకాలంలో చికిత్స అవసరం అంటున్నారు నిపుణులు. లక్షణాలను గుర్తిస్తే సకాలంలో చికిత్స చేయవచ్చు. ఈ లక్షణాల గురించి తెలుసుకోండి..
- కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం..
- శరీర బరువు వేగంగా పెరుగుట
- ఆకలి వేయకపోవడం
- తరచుగా జబ్బుల బారిన పడుతుండటం
- ఉదరం, చీలమండలలో వాపు లాంటి ఫిర్యాదులు
- రక్తపు వాంతులు
- మలంలో రక్తం
- అలసట, మానసిక సమస్యలు
- కడుపు నొప్పి మొదలైనవి..
ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ నివారణ చిట్కాలు..
ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. కాలేయం బరువు శరీర బరువులో 5 నుంచి 10 శాతం కంటే ఎక్కువగా మారినప్పుడు ఈ సమస్య వస్తుంది.
ఈ సమస్యను నివారించడానికి మద్యం తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఈ సమస్య మద్యం సేవించడం వల్ల వస్తుంది. అందువల్ల, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌ను నివారించేందుకు ఆల్కహాల్‌ను పూర్తిగా బంద్ చేయాలని.. ఇంకా ఆహారంలో మార్పులు అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..