AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mushroom Benefits: పుట్టగొడుగులతో గుండె పదిలం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

పిజ్జా, సూప్ లేదా మష్రూమ్‌ కర్రీ ఇలా చాలా రకాలు అందరినీ ఊరించేలా చేస్తాయి. అందుకే.. విభిన్న వంటకాలకు మష్రూమ్ ప్రసిద్ధిగా మారాయి.

Mushroom Benefits: పుట్టగొడుగులతో గుండె పదిలం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Mushroom Benefits
Shaik Madar Saheb
|

Updated on: Jul 18, 2022 | 8:01 PM

Share

Mushroom Benefits For Health: పొట్టగొడుగుల్లో బోలడన్ని పోషకాలున్నాయి. అందుకే.. మష్రూమ్‌ను చాలామంది ఇష్టంతో తింటారు. అయితే పొట్ట గొడుగులు తినడం ఆరోగ్యానికి చాలామంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని శాఖాహారులు ఎక్కువగా తింటారు. ఈ రోజుల్లో చాలా రకాల వంటలలో పుట్టగొడుగులను ఉపయోగిస్తున్నారు. పిజ్జా, సూప్ లేదా మష్రూమ్‌ కర్రీ ఇలా చాలా రకాలు అందరినీ ఊరించేలా చేస్తాయి. అందుకే.. విభిన్న వంటకాలకు మష్రూమ్ ప్రసిద్ధిగా మారాయి. పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి.. కొనుగోలు చేసేటప్పుడు ఎలా ఎంచుకోవాలి.. అనే విషయాలను తెలుసుకోండి..

గుండె జబ్బులకు మంచిది..

పుట్టగొడుగులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరాన్ని దెబ్బతీసే రాడికల్స్ నుంచి మనలను రక్షిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు దూరంగా ఉండడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.

ఇవి కూడా చదవండి

కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది..

పుట్టగొడుగులలో ఉండే బీటా గ్లూకాన్ ఒక రకమైన డైటరీ ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది..

మష్రూమ్ పొటాషియానికి మంచి మూలం.. ఇది శరీరంలో సోడియం ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను కూడా సడలిస్తుంది. దీని కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

పొట్టగొడగులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుట్టగొడుగులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి .

చర్మ సమస్యలు దూరం..

మష్రూమ్స్‌లో ఉండే పాలీశాకరైడ్‌లు చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పని చేస్తాయి. దీనితో పాటు ఇవి ఇన్ఫెక్షన్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

పుట్టగొడుగులు ఇలా ఉండేలా చూసుకోండి..

  • పుట్టగొడుగులు తాజాగా ఉన్నాయో లేదో చూడండి.
  • మష్రూమ్స్ మృదువుగా ఉండాలి.
  • పైన పొడిగా ఉండేలా చూసుకోవాలి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..