AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వర్షాలు పడటంలేదని ఫిర్యాదు చేసిన రైతు.. ఎవరిపైనో తెలిస్తే షాక్‌ అవుతారు.. లేఖ వైరల్‌

తదుపరి చర్యల కోసం తహశీల్దార్ ఈ లేఖను డీఎం కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు లేఖలో తహశీల్దార్ అధికారిక ముద్ర, 'తదుపరి చర్య కోసం ఫార్వార్డ్ చేయబడింది' అని రాసిపెట్టిన వ్యాఖ్య ఉంది. ఈ లేఖ వైరల్‌గా మారడంతో..

Viral News: వర్షాలు పడటంలేదని ఫిర్యాదు చేసిన రైతు.. ఎవరిపైనో తెలిస్తే షాక్‌ అవుతారు.. లేఖ వైరల్‌
Indra Devta
Jyothi Gadda
|

Updated on: Jul 18, 2022 | 8:23 PM

Share

Viral News: వర్షాలు కురవకపోవడానికి ఆ ఇంద్రుడే కారణమంటూ.. ఆ దేవునిపై ఫిర్యాదు చేశాడు ఓ రైతు. సోషల్ మీడియాలో ఫిర్యాదు లేఖ వైరల్‌ కావటంతో స్థానిక తహశీల్దార్ స్పందించారు. ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, తహశీల్దార్ అవసరమైన చర్య కోసం దానిని జిల్లా మేజిస్ట్రేట్‌కు పంపారు.ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో చోటు చేసుకుంది. వర్షం కురవకపోవడంతో దేవునిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ రైతు ఇంద్రుడిపై ఫిర్యాదు చేశాడు. సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు 16 జూలై 2022న సంపూర్ణ సమాధాన్ దివస్‌లో ఇండ్రుడికి వ్యతిరేకంగా ఫిర్యాదును సమర్పించారు. ఈ సందర్భంగా సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో వర్షాలు సరిగా కురవకపోవడంతో ( lack of rain in Gonda) ఇంద్రపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కల్నల్‌గంజ్ తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, తహశీల్దార్ అవసరమైన చర్య కోసం దానిని జిల్లా మేజిస్ట్రేట్‌కు పంపారు.

సుమిత్ కుమార్ యాదవ్ గోండా జిల్లాలోని కల్నల్‌గంజ్ తహశీల్‌లోని ఝలా గ్రామంలోని కౌడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్రా బజార్ బ్లాక్‌లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో వర్షాలు,కరువుల గురించి లార్డ్ ఇంద్రపై చేసిన ఫిర్యాదులో (ఫిర్యాదు సంఖ్య 684) సుమిత్ కుమార్ యాదవ్ ఇలా వ్రాశాడు, “ఈ ఫిర్యాదుతో, ఫిర్యాదుదారు దీన్ని గౌరవనీయులైన అధికారుల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నారు. చాలా నెలలుగా వర్షాలు లేవు. కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి పశుపక్షాదులు, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున, ఈ విషయంలో తగు చర్యలు తీసుకుని బాధ్యత వహించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నామని తెలిపారు.

తదుపరి చర్యల కోసం తహశీల్దార్ ఈ లేఖను డీఎం కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు లేఖలో తహశీల్దార్ అధికారిక ముద్ర, ‘తదుపరి చర్య కోసం ఫార్వార్డ్ చేయబడింది’ అని రాసిపెట్టిన వ్యాఖ్య ఉంది. ఈ లేఖ వైరల్‌గా మారడంతో తహశీల్దార్‌ పనిలో ఒత్తిడి పెంచుతున్నారా.. లేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సరిగా చదవకుండా తాత్సారం చేస్తున్నారనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. ఫిర్యాదు కాపీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, జిల్లా అధికారులు కేసును చేపట్టి, విచారణకు హామీ ఇచ్చారని తెలిసింది. ఈ వ్యవహారాన్ని జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుందని డీఎం డా.ఉజ్వల్ కుమార్ తెలిపారు. కేసు విచారణ నిమిత్తం సీఆర్‌వో జయ యాదవ్‌కు అప్పగించినట్లు తెలిపారు. విచారణ కోసం యాదవ్ కల్నల్‌గంజ్ చేరుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, తహశీల్దార్ అటువంటి ఫిర్యాదు గురించి తమకు తెలియదని ఖండించారు. ఈ వైరల్ ఫిర్యాదు లేఖ గురించి అడిగినప్పుడు తహశీల్దార్ నర్సింహ నారాయణ్ వర్మ షాక్ అయ్యారు. అతను, “అలాంటి విషయం నాకు రాలేదు. ఆ ఫిర్యాదు లేఖపై కనిపించే ముద్ర నకిలీ ముద్ర. సంపూర్ణ సమాధాన్ దివస్‌లో వచ్చిన ఫిర్యాదులు సంబంధిత విభాగాలకు నామినేట్ చేయబడతాయి. ఈ ఫిర్యాదులు ఏ ఇతర కార్యాలయాలకు పంపబడవు. కాబట్టి,ఇదంతా ఫేక్‌ అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి