Viral: టాయిలెట్‌ కోసం గుంత తవ్వగా.. వినిపించిన భారీ శబ్దం.. మట్టి తీస్తుండగా కళ్లు జిగేల్.!

టాయిలెట్ నిర్మాణంలో భాగంగా గుంత తవ్వుతుండగా ఓ భారీ శబ్దం వినిపించింది. అక్కడున్న మట్టిని బయటికి తీస్తున్న కూలీల కళ్ళు ఒక్కసారిగా జిగేలుమన్నాయి..

Viral: టాయిలెట్‌ కోసం గుంత తవ్వగా.. వినిపించిన భారీ శబ్దం.. మట్టి తీస్తుండగా కళ్లు జిగేల్.!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 18, 2022 | 7:33 PM

ఓ మహిళ ఇంట్లో టాయిలెట్‌ నిర్మాణం కోసం కూలీల సహాయంతో గుంత తవ్వించింది. ఈ క్రమంలోనే కూలీలకు ఓ రాగిపాత్ర కనిపించింది. దాన్ని తెరిచిచూడగా.. బ్రిటిష్‌ కాలం నాటి బంగారు నాణేలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్‌ జౌన్‌పూర్‌ జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలో జరిగిందీ ఘటన. కుటుంబ సభ్యులు గానీ, కూలీలు కానీ విషయాన్ని బయటకి పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. చివరకు బంగారు నాణేల సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. బంగారు నాణేలు 1889-1920 మధ్య బ్రిటిష్‌ కాలానికి చెందినవని తేలింది. పోలీసులు పలువురు కూలీలను విచారించగా.. మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం.

రాగి పాత్రలో బంగారు నాణేలు కనిపించడంతో కూలీలు పనులు మానేసి వాగ్వాదానికి దిగారు. మరుసటి రోజు కూలీలు తిరిగి వచ్చి మళ్లీ ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అన్న ఆశతో మళ్లీ తవ్వారు. అయితే, ఓ కూలీ రైనీని తనకు బంగారు నాణేలు కావాలని డిమాండ్‌ చేశాడు. దీంతో కూలీకి ఒక బంగారు నాణెం ఇచ్చాడు. అయితే, బంగారు నాణేల విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు రైనీ కుటుంబాన్ని, కూలీలను విచారించగా.. మొదట అలాంటిదేమీ లేదని బుకాయించారు. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో చివరకు విషయాన్ని బయటపెట్టారు. కూలీలు బంగారు నాణేలను పోలీసులకు తిరిగి ఇచ్చారు. అసలు రాగి పాత్రలో ఎన్ని నాణేలు దొరికాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కూలీలను పోలీసులు విచారిస్తున్నారు. సంఘటనా స్థలానికి వెళ్లగా.. కూలీలను ఆరా తీస్తే పది నాణేలు లభ్యమయ్యాయి.

Gold Coins