Friendship: స్నేహమంటే ఇదేరా.. ఫుడ్‌ డెలివరీ బాయ్‌ చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరలవుతున్న వీడియో

ఏదైనా ఫుడ్‌ ఆర్డర్ చేసిననప్పుడల్లా ఫుడ్ డెలివరీ మ్యాన్ గడువులోపు పెట్టిన ఆర్డర్‌ డెలివరీ చేస్తారని మన అందరికీ తెలుసు. అయితే, కొన్నిసార్లు కొంతమంది డెలివరీ బాయ్స్‌

Friendship: స్నేహమంటే ఇదేరా.. ఫుడ్‌ డెలివరీ బాయ్‌ చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరలవుతున్న వీడియో
Swiggy Delivery
Follow us

|

Updated on: Jul 18, 2022 | 9:59 PM

ఒకరి కష్టాన్ని అర్థం చేసుకుని సహాయం చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఫుడ్ డెలివరీ బాయ్స్‌కి సంబంధించినది. ఏదైనా ఫుడ్‌ ఆర్డర్ చేసిననప్పుడల్లా ఫుడ్ డెలివరీ మ్యాన్ గడువులోపు పెట్టిన ఆర్డర్‌ డెలివరీ చేస్తారని మన అందరికీ తెలుసు. అయితే, కొన్నిసార్లు కొంతమంది డెలివరీ బాయ్స్‌ సైకిళ్ల వంటి వాహనాలను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఫుడ్ డెలివరీ టైమ్‌లో కాస్త వెనుకాముందు అవుతుంటుంది. అలా జరగకుండా ఉండేందుకు సైకిల్‌పై వెళ్తున్న జొమాటో ఫుడ్ డెలివరీ మ్యాన్‌ని బైక్‌పై వెళ్తున్న ఫుడ్ డెలివరీ మ్యాన్ స్విగ్గీ డెలివరీ బాయ్‌ చేసిన సాయం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ కారు డ్రైవర్ తన మొబైల్ ఫోన్‌తో ఈ స్నేహ పూర్వక దృశ్యాన్ని చిత్రీకరించారు. మీరు వీడియోను నిశితంగా పరిశీలిస్తే..

వైరల్‌ అవుతున్న వీడియోలో సైకిల్‌పై జొమాటో ఫుడ్ డెలివరీ మ్యాన్ చేయి పట్టుకుని బైక్‌పై స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్‌ వెళ్తుండటం చూడొచ్చు. ప్రత్యర్థి కంపెనీ అయినప్పటికీ పేదలకు సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. సన్నా అరోరా జూలై 9న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను పంచుకున్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. స్నేహాన్ని ప్రశంసిస్తూ 4.66 లక్షల లైక్‌లు, అనేక కామెంట్లు అందుకుంటోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sannah Arora (@sannaharora)

ఒక వినియోగదారు “నేటి ప్రపంచంలో మనకు ఇది అవసరం” అని చెప్పగా, మరొకరు “సామాన్యుడి రోజువారీ జీవన పోరాటం” అని రాశారు, మరికొందరు “పనిచే విభజించబడి మానవత్వంతో ఐక్యమయ్యారు” అని రాశారు. అయితే, ప్రత్యర్థి పంపిణీ సంస్థలు పరస్పరం సహాయం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. జొమాటో ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి స్కూటర్‌పై స్విగ్గీ ఫుడ్ డెలివరీ మ్యాన్ వెనుక కూర్చున్న ఫోటో కూడా అంతకుముందు వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి