భలే కేసు గురూ..!  కారులో కల్తీ మద్యంతో పట్టుబడ్డ విదేశీ జాతి కుక్క.. అరెస్ట్‌ చేసి జైల్లోపెట్టిన పోలీసులు

ఎక్సైజ్, ప్రొహిబిషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ స్థానిక పోలీసులు జర్మన్ షెపర్డ్‌ డాగ్‌ను అరెస్ట్ చేశారు. ఆ జర్మన్ షెపర్డ్‌ కేవలం ఇంగ్లీష్‌ మాటలను మాత్రమే అర్థం చేసుకుంటున్నదని, దీంతో దానికి ఆ మేరకు సూచనలు ఇచ్చేందుకు ఇంగ్లీష్‌ తెలిసిన వ్యక్తి సహాయం తీసుకుంటున్నారని..

భలే కేసు గురూ..!  కారులో కల్తీ మద్యంతో పట్టుబడ్డ విదేశీ జాతి కుక్క.. అరెస్ట్‌ చేసి జైల్లోపెట్టిన పోలీసులు
Dog
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 18, 2022 | 9:10 PM

ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ఒక ఆడ కుక్కను అరెస్ట్‌ చేశారు పోలీసులు..అక్కడి ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ స్థానిక పోలీసులు జర్మన్ షెపర్డ్‌ డాగ్‌ను అరెస్ట్ చేశారు. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చేరటంతో వార్త వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది..? అసలు ఇంతకీ ఏం జరిగిందనే వివరాలు పరిశీలించగా..

బీహార్ రాష్ట్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఈ నెల 6న బక్సర్‌ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్ నుంచి వస్తున్న ఎస్‌యూవీని ఆపి సోదా చేశారు. ఆ కారులో ఆరు విదేశీ మద్యం సీసాలు కనిపించాయి. దాంతోపాటు కారులో ప్రయాణిస్తున్న సతీశ్‌ కుమార్‌, భువనేశ్వర్ యాదవ్‌కు బ్రీత్‌ అనాలిసిస్‌ టెస్ట్‌ నిర్వహించారు. వారిద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బీహార్‌లో మద్యాన్ని నిషేధించిన నేపథ్యంలో సంబంధిత ఎక్సైజ్ చట్టాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్ట్‌ చేశారు. అలాగే వారు ప్రయాణిస్తున్న కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ కారులో వారితో పాటు ఉన్న జర్మన్ షెపర్డ్‌ డాగ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద పోలీసులు డాగ్‌ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందన్న కారణంతో దానిని ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఆ కుక్కకు డాగ్‌ ఫుడ్‌ పెడుతున్నారు. అయితే, ఇక్కడ పోలీసులకు మరో తలనొప్పి వచ్చిపడింది.

ఆ జర్మన్ షెపర్డ్‌ కేవలం ఇంగ్లీష్‌ మాటలను మాత్రమే అర్థం చేసుకుంటున్నదని ఒక పోలీస్‌ అధికారి తెలిపారు. దీంతో దానికి ఆ మేరకు సూచనలు ఇచ్చేందుకు ఇంగ్లీష్‌ తెలిసిన వ్యక్తి సహాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. జాతి కుక్కను పోలీస్‌ స్టేషన్‌లో ఉంచడం ఖరీదైన వ్యవహారమని అన్నారు. అరెస్టు అనంతరం సతీష్ కుమార్, భువనేశ్వర్ యాదవ్‌లను ఎక్సైజ్ చట్టాల ప్రకారం వ్యవహరించే ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే