ఆర్టీసీలో భర్త డ్రైవర్‌.. భార్య కండక్టర్‌.. ఒకే బస్సులో ఉద్యోగం చేస్తున్న జంట కథ ఆదర్శం..

వారు స్వయంగా భార్యభర్తలు.. భర్త బస్‌ డ్రైవర్‌ కాగా, భార్య అందులోనే కండక్టర్‌గా పనిచేస్తోంది. ఈ బస్సంటే అక్కడి ప్రయాణికులకు ఎంతో ఇష్టం. కాస్త లేటైనా సరే, అదే బస్సు వచ్చే వరకూ ఆగి.. అందులోనే ప్రయాణిస్తారు. ఎందుకో తెలిస్తే...

ఆర్టీసీలో భర్త డ్రైవర్‌.. భార్య కండక్టర్‌.. ఒకే బస్సులో ఉద్యోగం చేస్తున్న జంట కథ ఆదర్శం..
Kerala Couple Story
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 21, 2022 | 6:46 PM

kerala couple: ప్రయాణీకులంతా ఆ బస్సు ఎక్కేందుకు ఎదురుచూస్తున్నారు. ఆ బస్సు సాధారణ ప్రభుత్వ బస్సులకు పూర్తి భిన్నంగా ఉంటుంది. బస్సులో ఎల్‌ఈడీ లైట్లు, మ్యూజిక్‌ సిస్టమ్‌తో కూడిన బస్సు గదులు కలిగి ఉంటుంది. ఇక ప్రయాణికుల భద్రత కోసం బస్సులో సీసీటీవీ కెమెరా కూడా ఉంది. కానీ, ఇన్ని హంగులతో కూడిన ఈ బస్సులో మరో విశేషం ఉంది.. ఇక్కడ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ ఆ బస్సు డ్రైవర్‌, లేడీ కండక్టర్‌ అంటున్నారు అక్కడి ప్రయాణికులు. వారు స్వయంగా భార్యభర్తలు.. భర్త బస్‌ డ్రైవర్‌ కాగా, భార్య అందులోనే కండక్టర్‌గా పనిచేస్తోంది. ఈ బస్సంటే అక్కడి ప్రయాణికులకు ఎంతో ఇష్టం. కాస్త లేటైనా సరే, అదే బస్సు వచ్చే వరకూ ఆగి.. అందులోనే ప్రయాణిస్తారు. ఎందుకో తెలిస్తే… మనకు కూడా ఓ ట్రిప్ వెయ్యాలనిపించకమానదు. ప్రస్తుతం ఆ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు వాళ్లను తెగ మెచ్చుకుంటున్నారు.

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఆ వీడియోలో గిరి,తారా అని ఇద్దరు భార్యాభర్తలు కలిసి బస్సును నడుపుతున్నారు. అయితే ఇందుకోసం వారు ప్రభుత్వాన్ని పర్మిషన్ కూడా కోరారు. అనుమతి లభించడంతో బస్సు పై సొంత పెట్టుబడి పెట్టి, గిరి బస్సుకు డ్రైవ్ పని చేస్తుండగా అతని భార్య తారా కండక్టర్ గా చేస్తోంది. అయితే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఈ బస్సును ఆ జంట కలర్ ఫుల్ గా డెకరేట్ చేసింది. అంతేకాకుండా ఆ బస్సు లోపల మ్యూజిక్ సిస్టం, ఆరు సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ స్విచ్ లు, ఎల్ఈడి డెస్టినేషన్ బోర్డ్, ఆటోమేటిక్ ఎయిర్ ఫ్రెష్ నర్స్ ఇలా అబ్బో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే..పెళ్లివారి బస్సులా ముస్తాబు చేసి అలంకరించారు. బస్సులో ఎక్కి ప్రయాణిస్తున్నామన్న అనుభూతి కంటే ఏదో పిక్నిక్‌కి వెళుతున్నామనే అనుభూతి ప్రయాణికులకు కలిగేలా చేస్తున్నారు. గిరి, తార తమ సొంత డబ్బు ఖర్చు చేసి ఈ బస్సును ఇలా అందంగా తీర్చిదిద్దారు. వీరికి చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. వాస్తవానికి, ఈ బస్సులో నిత్యం ప్రయాణించే ప్రయాణికులు అనేక వాట్సాప్ గ్రూపులను కూడా ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

గిరి-తారా ఇద్దరూ కలిసి ప్రతిరోజూ తెల్లవారుజామున 1.15 గంటలకు లేచి 2 గంటలకు డిపోకు చేరుకుంటామని వారు సంతోషంగా చెబుతున్నారు. గిరి బస్సును శుభ్రం చేస్తాడు. ఇద్దరికీ డ్యూటీ ఉదయం 5.50 గంటలకు ప్రారంభమవుతుందని తారా చిరునవ్వుతో చెప్పారు. 20 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తార, గిరిలు ఇటీవలే వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. గోపీనాథ్, తార ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా పరిచయం పెరిగింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత దాదాపు 20 ఏళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే వీరి ఇరువురి కుటుంబసభ్యులు వీరి పెళ్లికి అభ్యంతరం చెప్పారు. ఎట్టకేలకు కోవిడ్ లాక్‌డౌన్ మధ్య ఈ జంట 2020లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. 2007లో గోపీనాథ్ పరీక్ష పాసయ్యాడు. వారు 2010లో ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ హరిపాడు డిపోలో పనిచేస్తున్నారు. అసలైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్నారు ఈ కేరళ జంట.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?