Viral Video: వెడ్డింగ్ పార్టీలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న యువకులు.. ఇంతలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ..

కొంతమంది యువతీయువకులు డ్యాన్స్ ఫ్లోర్‌లో అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ సమయంలో.. ఒక వ్యక్తి  ఒక మహిళను తీసుకుని వచ్చి.. తీన్మార్ స్టెప్స్ ను ఉత్సాహంగా వేస్తున్నాడు.

Viral Video: వెడ్డింగ్ పార్టీలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న యువకులు.. ఇంతలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ..
Marriage Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 21, 2022 | 6:25 PM

Viral Video: పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వివాహానికి సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఆసక్తిగా ఇష్టంగా చూస్తారు. పెళ్లి వేడుకల్లో జరిగే సందడిని ఫన్నీ వీడియోలను అధికంగా చూస్తూ ఉంటారు. కొన్ని వీడియోలు వధూవరులు డ్యాన్స్ చేయడం, బంధువుల సందడి, స్నేహితుల సరదా గిఫ్ట్ లు ఇలాంటి వీడియోలు చాలాసార్లు చూస్తాము. ఇటీవలి కాలంలో అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. పెళ్లి వేడుక లో డీజేలో డ్యాన్స్‌ సందర్భంగా ఆహుతుల మధ్య గొడవ జరిగింది.

కొన్ని సార్లు సరదా శృతిమించి.. వివాదాలకు గొడవలకు దారి తీయడం మనకు అందరికి తెలిసిందే.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఒక మహిళతో కలిసి డ్యాన్స్ చేయడానికి  ఆమె ను బలవంతంగా లాగాడు.. ఆ తర్వాత మహిళ బంధువు వచ్చి ఆ వ్యక్తితో గొడవకు దిగాడు. దీంతో అక్కడ  ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ వీడియో ఎక్కడిది అనేది స్ఫష్టంగా తెలియదు.. కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక్కడ వీడియో చూడండి

ఇవి కూడా చదవండి

డీజేలో పార్టీ సాంగ్ ప్లే అవుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఆహుతులు అందరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది యువతీయువకులు డ్యాన్స్ ఫ్లోర్‌లో అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ సమయంలో.. ఒక వ్యక్తి  ఒక మహిళను తీసుకుని వచ్చి.. తీన్మార్ స్టెప్స్ ను ఉత్సాహంగా వేస్తున్నాడు.. ఇంతలో డ్యాన్స్ మధ్యలో ఒకతను వచ్చి..  గొడవ పెట్టుకున్నాడు.

ఈ వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయబడింది. వైరల్‌గా మారుతున్న ఈ వీడియో ప్రజలను ఎంతగానో అలరిస్తోంది. దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తూ జనాలు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.  ‘పెళ్లిలో ఈ విధంగా గొడవపడటం సరికాదు’ అని కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తలను చదవడానికి క్లిక్ చేయండి