Viral Video: వామ్మో బుడ్డోడు మాములోడు కాదు.. బొమ్మ మాదిరిగా కొండచిలువతో ఆటలు.. చూస్తే షాకే

ఓ చిన్నారి భారీ కొండచిలువతో ఆడుకుంటున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ కొండచిలువను.. పెంపుడు జంతువుని అదిలించినట్లు అదిలిస్తూ.. భయంలేకుండా ఓ ఆటబొమ్మలా ఆడుకుంటున్న చిన్నారి ధైర్యాన్ని చూసి జనం షాక్ తింటున్నారు.  

Viral Video: వామ్మో బుడ్డోడు మాములోడు కాదు.. బొమ్మ మాదిరిగా కొండచిలువతో ఆటలు.. చూస్తే షాకే
Viral Video
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Jul 20, 2022 | 2:23 PM

Viral Video: కొండచిలువకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన  నెటిజన్లను ఆశ్చర్యపడుతున్నారు. నిజానికి ఈ వైరల్ క్లిప్‌లో ఒక చిన్న బాలుడు భారీ కొండచిలువతో ఆడుకుంటున్నాడు. బాలుడు కొండచిలువతో ఆడుకుంటున్న తీరు చూస్తే.. ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడచక మానదు. బాలుడు  భారీ కొండచిలువ (చైల్డ్ మరియు పైథాన్ వీడియో) పట్టుకొని దానితో సరదాగా గడుపుతున్నాడు. ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కొండచిలువ కూడా భారీగా భయానకంగా కనిపిస్తుంది. అయితే ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

వైరల్ అవుతున్న ఈ వీడియో కొన్ని సెకన్ల పాటు ఉంది.. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఆ వీడియోలో దాదాపు రెండేళ్ల చిన్నారి ఇంటి బయట ఓ పెద్ద కొండచిలువతో ఆడుకోవడం గమనించవచ్చు. కొండచిలువ స్వభావమేంటో మనకు తెలుసు.. కానీ చిన్నారి బాలుడికి తెలియదు.. అమాయకత్వంతో భారీ కొండచిలువతో ఆడుకుంటున్నాడు. ఈ దృశ్యాన్ని చూస్తే గుండె చప్పుడు పెరుగుతుంది. పిల్లవాడు  కొండచిలువని నోటితో పట్టుకునాడుఁ.. దాని వెనుక కూర్చున్నాడు.. పడుకున్నాడు. ఒక ఆట బొమ్మ మాదిరిగా దానితో ఆటలు ఆడటం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by @natureshorrific

ఓ చిన్నారి భారీ కొండచిలువతో ఆడుకుంటున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నేచర్‌షోరిఫిక్ అనే పేజీలో షేర్ చేయబడింది. ఒక వినియోగదారుపై ఈ వీడియో పై కామెంట్ చేస్తూ.. నా పిల్లలు తెలివైనవారు.. ఈ రకమైన ప్రమాదాన్ని చూడగానే వారు అక్కడి నుండి వెళ్లిపోతారు. అదే సమయంలో.. మరొకరు.. తల్లిదండ్రులు తమ బిడ్డ గురించి ఆందోళన చెందడం లేదని తెలుస్తోంది. పాములు మనుషులతో ఎప్పుడూ స్నేహంగా ఉండవు కనుక వాటికి దూరంగా ఉండటమే ఉత్తమని కామెంట్ చేశారు.. భారీ కొండచిలువను.. పెంపుడు జంతువుని అదిలించినట్లు అదిలిస్తూ.. భయంలేకుండా ఓ ఆటబొమ్మలా ఆడుకుంటున్న చిన్నారి ధైర్యాన్ని చూసి జనం షాక్ తింటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..