Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alzheimer: మీరు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి

Alzheimer Disease: గత కొన్నేళ్లుగా వృద్ధుల్లో అల్జీమర్స్ సమస్య పెరుగుతోంది. దీంతో వృద్ధులు నిత్య జీవితంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కుటుంబంలో కూడా చాలా ఇబ్బందులు..

Alzheimer: మీరు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి
Alzheimer Disease
Follow us
Subhash Goud

|

Updated on: Jul 21, 2022 | 3:51 PM

Alzheimer Disease: గత కొన్నేళ్లుగా వృద్ధుల్లో అల్జీమర్స్ సమస్య పెరుగుతోంది. దీంతో వృద్ధులు నిత్య జీవితంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కుటుంబంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే బలహీనమైన జ్ఞాపకశక్తి కారణంగా వారు విషయాలను మరచిపోతారు. అల్జీమర్స్ వ్యాధి వృద్ధాప్యానికి సంబంధించినది. ఈ వ్యాధి 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. దాని లక్షణాలు క్రమంగా పెరుగుతాయి. దీని లక్షణాలను తగ్గించేందుకు మాత్రమే చికిత్స ఉంది తప్పా.. పూర్తిగా నయం అయ్యేందుకు లేదు. ధూమపానం, మద్యపానం కూడా దీనికి ఒక కారణం. ఇది కాకుండా నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా ఈ వ్యాధి కూడా సంభవించవచ్చు.

అల్జీమర్స్ సమస్య రాకుండా ఉండాలంటే రోజూ యోగా, మెడిటేషన్ చేయాలని ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ న్యూరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ పీఎన్ రంజన్ అంటున్నారు. సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆహారంలో పండ్లు, కూరగాయలు, చేపలు, గింజలు ఉండాలి. దీనితో నిద్ర సరిగ్గా ఉండాలి. అర్థరాత్రి వరకు నిద్రపోవడం అలవాటు చేసుకోకండి. ఈ సమస్యతో బాధపడుతున్నవారు జీవనశైలిని సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. అతిగా మద్యపానం లేదా ధూమపానం చేసే వ్యక్తులకు ఎక్కువగా సంభవిస్తుంటుంది. వీటిని దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఆల్కహాల్ తాగడం వల్ల అల్జీమర్స్ సమస్య వస్తుంది.

జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది

ఇవి కూడా చదవండి

అల్జీమర్స్ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుంది. అంటే కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే అది ఇతర సభ్యులకు కూడా రావచ్చు. పాలీపోప్రొటీన్ E (APOE) అనేది వృద్ధులలో అల్జీమర్స్ లక్షణాలను ప్రారంభించే జన్యువు. ఈ వ్యాధి ఏడు దశల్లో ఉంటుంది. దీని లక్షణాలు 40 ఏళ్ల తర్వాత మొదలవుతాయి. 60 ఏళ్ల తర్వాత గుర్తించిన వారు ఎందరో ఉన్నారు. అల్జీమర్స్‌తో బాధపడుతున్న రోగి చివరి దశలో మరొక వ్యక్తిపై ఆధారపడతాడు. ఆహారం నుండి ఇతర రోజువారీ పనుల వరకు, అతనికి మరొక వ్యక్తి అవసరం ఉంటుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వృద్ధులకు మరో వ్యక్తి సహాయంగా లేకుంటే ఇంకా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో వృద్ధులకు ఈ వ్యాధి ఉంటే అతనిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే లక్షణాలు పెరిగితే రోగి చాలా ఇబ్బందులు పడవచ్చు.

ఇవి అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు

☛ దృష్టి లేకపోవడం

☛ అనిశ్చితత్వం

☛ ఎప్పుడూ అయోమయం

☛ మతిమరుపు

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి