Health: పెరుగు, సలాడ్స్ లో ఉప్పు వేసుకుని లాగించేస్తున్నారా.. అయితే రోజులు దగ్గర పడినట్లే
ఏ వంటల్లోనైనా తప్పకుండా ఉపయోగించే ఉప్పు రుచిని పెంపొందిస్తుందన్నది మనందరికీ తెలిసిందే. ఎంతగా ఉంటే ఉప్పు లేని వంటను తినలేనంతగా.. ప్రతి వంటకంలో ఉప్పు తప్పనిసరి అవడం వల్ల మనకు తెలియకుండానే అధిక మొత్తంలో తినేస్తున్నాం....
ఏ వంటల్లోనైనా తప్పకుండా ఉపయోగించే ఉప్పు రుచిని పెంపొందిస్తుందన్నది మనందరికీ తెలిసిందే. ఎంతగా ఉంటే ఉప్పు లేని వంటను తినలేనంతగా.. ప్రతి వంటకంలో ఉప్పు తప్పనిసరి అవడం వల్ల మనకు తెలియకుండానే అధిక మొత్తంలో తినేస్తున్నాం. ఫలితంగా ఎన్నో ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నాం. ఉప్పులో ఉండే సోడియం, పోటాషియం దీనికి కారణం. అయితే ఓ సర్వేలో షాకింగ్ విషయాలు తెలిశాయి. తక్కువగా ఉప్పు తినే వారితో పోలిస్తే.. ఎక్కువ ఉప్పు తినే వారికి అకాల మరణం ముప్పు 28 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. దాదాపు 5 లక్షల మందిపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, రోజుకు 2 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినడం వల్ల హైపర్‌టెన్షన్, గుండె సమస్యలు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఉప్పు తగినంత మోతాదు కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు, వాపు, అధిక రక్తపోటు, దాహం ఎక్కువగా వేయడం, మూత్రవిసర్జన, నిద్రలేమి, నీరసం, జీర్ణకోశ సమస్యలు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిషెస్ వండే సమయంలో చాలామంది కారంతో పాటు ఉప్పు కూడా వేసేస్తుంటారు. కానీ కూర పూర్తిగా ఉడికిన తర్వాత.. దానిపై నుంచి కాస్త ఉప్పు చల్లినా రుచికి సరిగ్గా సరిపోతుందంటున్నారు నిపుణులు. సాస్‌లు, నిల్వ పచ్చళ్లు మొదలైన వాటిలో ఉప్పు మోతాదుకు మించి ఉంటుంది. ఇలాంటివి అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. పెరుగు, సలాడ్స్, పండ్లను ఉప్పు చల్లుకొని తినడం కంటే నేరుగా తినడమే మంచిది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు వైద్యులు, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..