Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: చల్లటి చిరుజల్లులు పడుతూ ఉంటే.. వెచ్చటి టీ తోడుగా ఉంటే.. ఆనందం, ఆరోగ్యం

చిటపట చినుకులు ఓ వైపు.. ఘుమఘుమలాడుతూ పొగలు కక్కే టీ (Tea) మరో వైపు.. చదువుతుంటేనే మనసు ఊహల్లో తేలిపోతోంది కదూ. చాలా మందికి టీ లేదా కాఫీతో ఉదయం ప్రారంభమవుతుంది. టీ కాఫీలను తాగితే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. అయితే...

Health: చల్లటి చిరుజల్లులు పడుతూ ఉంటే.. వెచ్చటి టీ తోడుగా ఉంటే.. ఆనందం, ఆరోగ్యం
Green Tea
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 21, 2022 | 10:47 AM

చిటపట చినుకులు ఓ వైపు.. ఘుమఘుమలాడుతూ పొగలు కక్కే టీ (Tea) మరో వైపు.. చదువుతుంటేనే మనసు ఊహల్లో తేలిపోతోంది కదూ. చాలా మందికి టీ లేదా కాఫీతో ఉదయం ప్రారంభమవుతుంది. టీ కాఫీలను తాగితే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. అయితే వానాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వ్యాధులు ముంచుకొస్తాయి. అందుకోసం మనం ఎంతో ఇష్టంగా తాగే టీ లో ఈ పదార్థాలు వేసుకుంటే ఆరోగ్యం, ఆనందం మీ సొంతం. టీలో కొద్దిగా పసుపు (Turmeric) వేసుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి మంచి కలుగుతుంది. ఇది చాలా సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉంటాయి. బరువు తగ్గేందుకూ పసుపు ఉపయోగపడుతుంది. ఆయుర్వేద వైద్యంలో పసుపును విస్తృతంగా వాడతారు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించాలంటే పాలలో పసుపు వేసుకుని తాగాలని ఆరోగ్య (Health) నిపుణులు సూచిస్తున్నారు. చిటికెడు పసుపును టీ లో వేసుకుని తీసుకుంటే ఇన్ఫెక్షన్స్‌కి దూరంగా ఉండొచ్చు.

తులసి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆయుర్వేద కాలం నుంచి తులసి వినియోగంలో ఉంది. తులసిని తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పోతాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ డి, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. బ్యాక్టీరియాను తొలగించడానికి తులసి ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అల్లాన్ని మనం తరచూ వంటల్లో వాడుతూనే ఉంటాం. పైగా అల్లం తో టీ కూడా తయారు చేసుకుంటూ ఉంటాం. చాలా మంది రోజూ తాగే టీలో అల్లాన్ని వేసుకుంటారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అజీర్తి, వికారం సమస్యలను తగ్గిస్తుంది.

మందారం పువ్వులను నీళ్లల్లో వేసుకుని మరిగించి తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మందారంలో బీటా కెరోటిన్ ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మందారం అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ వంటివి రాకుండా చూసుకుంటుంది. జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు వైద్యులు, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..