Maoists Letter: వారి కోసం రూ. లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించండి.. తెలుగు రాష్ట్రాలకు మావోయిస్టుల లేఖ

భద్రాద్రి కొత్తగూడెం - అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం అయ్యాయంటూ మావోయిస్టు పార్టీ లేఖలో ఆరోపించింది.

Maoists Letter: వారి కోసం రూ. లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించండి.. తెలుగు రాష్ట్రాలకు మావోయిస్టుల లేఖ
Maoists
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 21, 2022 | 8:17 PM

Maoists Letter on Floods: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు అపారనష్టాన్ని కలిగించాయి. వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇళ్లు, పంటలన్నీ నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు సర్వం కోల్పోయి పునరావస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు లేఖ విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం అయ్యాయంటూ మావోయిస్టు పార్టీ లేఖలో ఆరోపించింది. పునరావాస కేంద్రాల్లో బాధితులు ఆకలితో అలమటిస్తున్నారని, ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు సుమారు 500 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి వరదల నుంచి శాశ్వత రక్షణ కోసం రూ. లక్ష కోట్ల ప్యాకేజి ప్రకటించాలని మావోయిస్టు పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామరాజు (బీకే-ఏఎస్ఆర్) కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఈ లేఖ విడుదలైంది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో వేలాది మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. ఇప్పటికే అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాలు బాధితులకు పరిహారాన్ని సైతం ప్రకటించాయి. ఈ క్రమంలో బీజేపీ నేతల విన్నపం మేరకు తెలంగాణలో వరద నష్టంపై అధ్యయనానికి కేంద్ర బృందం సైతం రానుంది. ఢిల్లీ నుంచి తెలంగాణకు రానున్న ఆరుగురు సభ్యుల బృందం ముంపు ప్రాంతాలను పరిశీలించనుంది. దీంతోపాటు భద్రాచలం, కడెం ప్రాజెక్టులను పరిశీలించనుంది. వరదల నష్టాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి