AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tattoo addict: ఇతడో వింత మనిషి.. టాటూస్‌తో ‘బ్లాక్ ఏలియన్‌’గా మారిన వ్యక్తి.. ధైర్యముంటేనే చూడండి

ప్రస్తుతం తన పరిస్థితితో లోఫ్రెడ్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ రూపాన్ని చూసిన జనాలు జడుసుకుంటున్నారని చెప్పాడు. వీధుల్లో తనను చూసి అంతా భయంతో పరుగులు తీస్తున్నారట.

Tattoo addict: ఇతడో వింత మనిషి.. టాటూస్‌తో 'బ్లాక్ ఏలియన్‌'గా మారిన వ్యక్తి.. ధైర్యముంటేనే చూడండి
Tattoos
Jyothi Gadda
|

Updated on: Jul 21, 2022 | 9:10 PM

Share

Tattoo addict: ఇప్పడు సెలబ్రెటీల దగ్గర నుంచి కాలేజ్ స్టూడెంట్స్‌ వరకూ అంతా.. టాటూ ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు. ఇందులో బోలెడు రకాలు ఉన్నాయి. నేమ్స్‌, సింబల్స్‌ ఇలా తమకు ఇష్టమైనవి వేయించుకుంటున్నారు. ఒకటి రెండూ వేయించుకోవడం అయితే కామనే అనుకోవచ్చు..కానీ, బాడీ అంతా టాటూస్‌ ఉంటే.. దాన్ని ఏమనాలి.. పిచ్చి పీక్స్‌కి చేరిందనే చెప్పాలి. ప్రస్తుతం ఇదే కోవకు చెందిన ఒక వ్యక్తి తన బాడీ మొత్తం టాటూస్‌ వేసుకుని ‘బ్లాక్ ఏలియన్’గా మారిపోయాడు. దాంతో ఎక్కడా ఉద్యోగం దొరక్క అతడు పడరాని పాట్లు పడుతున్నాడు.

ఆంథోనీ లోఫ్రెడో అనే వ్యక్తి ఒళ్లంతా టాటూలు వేసుకుని ‘బ్లాక్ ఏలియన్’గా మారిపోవాలనుకున్నాడు.. రూపాంతరం చెందాలనుకున్నాడు. ఈ క్రమంలోనే కనుబొమ్మలతో పాటు శరీరంలోని ప్రతీ భాగాన్ని టాటూస్‌తో కప్పేశాడు. తల, చేతులు, చర్మం కింద ఇంప్లాంట్లు అమర్చుకున్నాడు. అంతేకాదు అతని రెండు వేళ్లు, ముక్కు, చెవులు కూడా కట్ చేయబడ్డాయి. ఫోర్క్‌డ్ ఎఫెక్ట్‌ క్రియేట్ చేసేందుకు నాలుకను మధ్యలోకి స్ల్పిట్ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, ప్రస్తుతం తన పరిస్థితితో లోఫ్రెడ్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ రూపాన్ని చూసిన జనాలు జడుసుకుంటున్నారని చెప్పాడు. వీధుల్లో తనను చూసి అంతా భయంతో పరుగులు తీస్తున్నారట. కొందరు పిచ్చివాడని అంటుంటే.. మరికొందరు అతన్ని చూసి గట్టి అరుస్తూ భయంతో పారిపోతున్నారట.

ఇక రాత్రి పూట పరిస్థితి మరీ భయంకరంగా ఉందంటున్నారు. దాంతో రాత్రివేళ బయటకు వెళ్లాలంటే ముందుగా తనే భయపడుతున్నాడట.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి