CM Bhagwant Mann: నదిని శుభ్రం చేశామంటూ.. నీరు స్వచ్ఛత తెలియజేయడం కోసం నది నీరు తాగి ఆస్పత్రిపాలైన సీఎం భగవంత్

సీఎం భగవంత్ మాన్ సింగ్ సిక్కులకు అత్యంత పవిత్రమైన కాళీబెయిన్ నదిలో నీరు తాగి అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. నది శుద్ధి కార్యక్రమంలో భాగంగా నది నీరు స్వచ్ఛతను తెలియజేయడం కోసం పబ్లిక్ గా నదిలోని గ్లాస్ లో నీరు ముంచుకుని తాగారు

CM Bhagwant Mann: నదిని శుభ్రం చేశామంటూ.. నీరు స్వచ్ఛత తెలియజేయడం కోసం నది నీరు తాగి ఆస్పత్రిపాలైన సీఎం భగవంత్
Punjab Cm Bhagwant
Follow us

|

Updated on: Jul 22, 2022 | 11:55 AM

CM Bhagwant Mann: పంజాబ్ (Punjab) ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం (జూలై 20వ తేదీ) ఢిల్లీలోని ఇంద్రప్రస్థ  ఆసుపత్రిలో చేరారు. అస్వస్థతకు గురైన మాన్‌  అపోలో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ఎడ్మిట్ అయ్యారు. సీఎం భగవంత్ కు కడుపునొప్పి రావడంతో.. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరినట్లు గురువారం వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రికి కడుపునొప్పి రావడంతో ఆయనకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనికి కారణం సీఎం భగవంత్ మాన్ సింగ్ సిక్కులకు అత్యంత పవిత్రమైన సుల్తాన్‌పూర్ లోధిలోని కాళీబెయిన్ నదిలో నీరు తాగి అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. నది శుద్ధి కార్యక్రమంలో భాగంగా నది నీరు స్వచ్ఛతను తెలియజేయడం కోసం పబ్లిక్ గా నదిలోని గ్లాస్ లో నీరు ముంచుకుని తాగారు. కలుషిత నీళ్లు త్రాగిన భగవంత్ మాన్ సింగ్ సాయంత్రానికే కడుపుతో ఇబ్బంది పడ్డారు. ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరి ప్రస్తుతం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ  నాయకుడు భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా మార్చి 16న ప్రమాణ స్వీకారం చేశారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో  ఎన్నికలలో AAP 92 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది.  కాంగ్రెస్ 18 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..