Crime: గుండెల్ని మెలిపెట్టే విషాద ఘటన.. బైక్ ను ఢీ కొన్న లారీ.. శిశువుకు జన్మనిస్తూ ప్రాణాలు కోల్పోయిన గర్భిణి

ఎన్నో ఆశలతో కాన్పు కోసం పుట్టింటికి పయనమైంది. పుట్టబోయే బిడ్డ గురించి కలలుకంటూ భర్తతో కలిసి బైక్ పై బయల్దేరింది. ఆనందంగా సాగిపోతున్న వారి ప్రయాణంలో మృత్యువు ఊహించని అతిథిగా చుట్టేసింది. వేగంగా వస్తున్న లారీ గర్భిణి ప్రాణాలను...

Crime: గుండెల్ని మెలిపెట్టే విషాద ఘటన.. బైక్ ను ఢీ కొన్న లారీ.. శిశువుకు జన్మనిస్తూ ప్రాణాలు కోల్పోయిన గర్భిణి
Crime
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 22, 2022 | 11:21 AM

ఎన్నో ఆశలతో కాన్పు కోసం పుట్టింటికి పయనమైంది. పుట్టబోయే బిడ్డ గురించి కలలుకంటూ భర్తతో కలిసి బైక్ పై బయల్దేరింది. ఆనందంగా సాగిపోతున్న వారి ప్రయాణంలో మృత్యువు ఊహించని అతిథిగా చుట్టేసింది. వేగంగా వస్తున్న లారీ గర్భిణి ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. లారీ ఢీ కొన్న సమయంలో బాధితురాలు శిశువుకు జన్మనిచ్చింది. చిన్నారి ముఖాన్నైనా చూడకుండానే పంటిబిగువున బాధను భరిస్తూ కన్నుమూసింది. ఈ ఘటన స్థానికులకు కంటతడి పెట్టించింది. ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు లారీ కింద పడిన నిండు గర్భిణి.. ప్రసవిస్తూనే మృతి చెందింది. ఆగ్రాకు చెందిన కామిని 8 నెలల గర్భవతి. కాన్పు కోసం భర్తతో కలిసి బైక్‌పై పుట్టింటికి వెళ్తోంది. ఫిరోజాబాద్‌ జిల్లాలో బర్తర గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి బైక్ అదుపు తప్పింది. బైక్ సడన్‌ బ్రేక్‌ వేయడంతో వాహనంపై కూర్చున్న యామిని కింద పడింది. అదే సమయంలో వేగంగా వస్తున్న లారీ అమె పై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కామినికి తీవ్ర గాయాలై.. అక్కడికక్కడే ఆడ శిశువును ప్రసవించి కన్నుమూసింది.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు శిశువును స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదమేమీ లేదని, ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో శిశువు తండ్రి సురక్షితంగా బయటపడ్డాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం అనంతరం ఆగకుండా వెళ్లిపోయిన లారీని సీసీటీవీ ఫుటేజ్‌ (CCTV) ద్వారా గుర్తించి డ్రైవర్‌ను అరెస్ట్‌ చేస్తామని పోలీస్‌ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ