Tollywood: వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా రూ.900 కోట్ల సినిమా రిజెక్ట్ చేసిన హీరోయిన్..

ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ చాలా స్పెషల్. వరుసగా 9 ప్లాప్ సినిమాల్లో నటించింది. అయినా ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఆమె నటనకు పాన్ ఇండియా అడియన్స్ ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా..

Tollywood: వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా రూ.900 కోట్ల సినిమా రిజెక్ట్ చేసిన హీరోయిన్..
Parineeti Chopra
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 25, 2024 | 9:35 PM

సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు రావాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాగే వచ్చిన స్టార్ డమ్ కాపాడుకోవడం కూడా కష్టమే. వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న తారల కెరీర్ లో కొన్ని ప్లాప్ సినిమాలు సైతం వస్తుంటాయి. అలాంటి సమయంలో కొందరు స్టార్స్ చేసే చిన్న పొరపాట్ల కారణంగా సినిమాలకు పూర్తిగా దూరమవుతుంటారు. కానీ కొందరు వరుసగా ప్లాప్ ఖాతాలో వేసుకున్నప్పటికీ ఇండస్ట్రీలో వారి డిమాండ్ ఏమాత్రం తగ్గదు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. వరుసగా 9 సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఆమెకు రూ.900 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో ఆఫర్ వచ్చింది. కానీ ఆ సినిమా ఛాన్స్ రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసా.. తనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా.

వరుస వైఫల్యాలను ఎదుర్కొన్నప్పటికీ ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇండస్ట్రీలో తనదైన నటనతో తన ఉనికిని కొనసాగిస్తుంది. 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ మూవీతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాకే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ గెలుచుకుంది. ఆ తర్వాత షాక్‌జాదే (2012), శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013),హసీ తో ఫాసీ (2014) వంటి హిట్‌ చిత్రాల్లో నటించింది. కానీ ఆ తర్వాత ఆమె కెరీర్ లో దావత్-ఎ-ఇష్క్ (2014), కిల్ దిల్ (2014), మేరీ ప్యారీ బిందు (2017), నమస్తే ఇంగ్లాండ్ (2018) సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి.

చాలా కాలం వరుస ప్లాప్ సినిమాల్లో నటించిన పరిణిది ఈ ఏడాది సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఆమె సింగర్ దిల్జిత్ దోసాంజ్ తో కలిసి నటించిన చమ్కిలా మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో పరణితి నటనకు మంచి మార్కులు కొట్టేసింది. గతేడాది సెప్టెంబర్ 24న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను వివాహం చేసుకుంది.

View this post on Instagram

A post shared by @parineetichopra

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.