AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన ప్రతి విషయం క్షణాల్లో వైరలవుతుంది. ముఖ్యంగా సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ఫేమస్ సింగర్ చైల్డ్ హుడ్ ఫోటో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..
Singer
Rajitha Chanti
|

Updated on: Dec 13, 2024 | 10:48 AM

Share

తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో మంది సూపర్ టాలెంట్ సింగర్స్ ఉన్నారు. టీవీల్లో పలు రియాల్టీ షోలలో విజేతలుగా నిలిచి.. ఇప్పుడు ఇండస్ట్రీలో గాయనిగాయకులుగా రాణిస్తున్నారు. అద్భుతమైన గాత్రంతో వెండితెరపై మాయ చేస్తున్నారు. ఎన్నో అందమైన పాటలతో శ్రోతల మనసులు గెలుచుకుంటున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన సింగర్. ఇప్పటివరకు తెలుగులో అనేక పాటలు ఆలపించింది. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కృషితో ఎంతో మంది సింగర్స్ వెండితెరకు పరిచయమయ్యారు. అందులో ఈ అమ్మాయి కూడా ఒకరు. బాలు స్టార్ట్ చేసిన పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా తెలుగు వారికి పరిచయమయ్యింది. తను ఎవరో కాదు.. సింగర్ రమ్య బెహరా.

గాన గాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం స్టార్ట్ చేసిన పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తనదైన అద్భుతమైన పాటలతో ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా దూసుకుపోతుంది. రమ్య బెహరా.. గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1994 ఫిబ్రవరి 1న జన్మించింది. కానీ రమ్య పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. రామాచారి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్న ఈ అమ్మాయి.. ఆ తర్వాత బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొని సంగీత దర్శకులను మెప్పించింది. దేశ, విదేశాల్లో ఎన్నో కచేరీలు చేసింది. తన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్దులను చేసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మెప్పు పొంది అనేక పాటలు పాడింది.

ఇవి కూడా చదవండి

వెంగమాంబ సినిమాతో ఆమెను సినీ సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు కీరవాణి. ఆ తర్వాత లచ్చిందేవికి ఓ లెక్కుంది, కృష్ణాష్టమి, బ్రూస్ లీ, బాహుబలి ది బిగినింగ్, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, కొత్తజంట, చిన్నదాన నీకోసం, సీతారామం వంటి సినిమాల నుంచి మొన్న బ్లాక్ బస్టర్ హిట్ అయిన అమరన్ వరకు అద్భుతమైన పాటలు పాడింది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో ఎన్నో పాటలు పాడింది. ఇటీవలే సింగర్ అనురాగ్ కులకర్ణిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం రమ్య కు సంబంధించిన చిన్ననాటి ఫోటో నెట్టింట వైరలవుతుంది.

View this post on Instagram

A post shared by Ramya Behara (@ramyabehara)

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..