Actress Madhoo: ఏమున్నార్రా బాబు.. అందంలో తల్లిని మించిపోయిన హీరోయిన్ మధుబాల కూతుర్లు..

దక్షిణాది సినీప్రియులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ మధుబాల. అప్పట్లో కుర్రాళ్ల కలల రాకుమారి. 90వ దశకంలో ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ రాణిస్తోంది.

Actress Madhoo: ఏమున్నార్రా బాబు.. అందంలో తల్లిని మించిపోయిన హీరోయిన్ మధుబాల కూతుర్లు..
Madhoo
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 05, 2024 | 4:38 PM

రోజా.. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇందులో అరవింద్ స్వామి హీరోగా నటించగా.. కథానాయికగా సినీప్రియులను కట్టిపడేసింది హీరోయిన్ మధుబాల అలియాస్ మధు. అమాయకమైన నటన.. చూపు తిప్పుకోనివ్వని అందంతో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈ సినిమాలోని సాంగ్స్ శ్రోతల హృదయాలను మెస్మరైజ్ చేశాయి. ఇక ఈ సినిమాతోనే యూత్ క్రష్ గా మారిపోయింది మధు. ఈ మూవీలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్న మధు.. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సొంతం చేసుకుంది. సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది మధు.

తెలుగులో చిలక్కొట్టుడు, ఆవేశం, గణేష్, అల్లరి ప్రియుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే బాలీవుడ్ నటి జుహీ చావ్లా బంధువు ఆనంద్ ను వివాహం చేసుకుంది మధు. 1999 ఫిబ్రవరి 19న వీరి పెళ్లి జరిగింది. వీరికి అమెయా, కెయా అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న మధు.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మధు చాలా యాక్టివ్. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

అయితే తాజాగా మధు తన కూతుర్ల ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. అందులో మధు కూతుర్లు అమెయా, కెయా ఇద్దరు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. అచ్చం హీరోయిన్స్ మాదిరిగానే ఉన్నారని..అందంలో తల్లిని మించిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మధు కూతుర్లు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.