Tollywood: ఈ బక్కపల్చని మనిషిని గుర్తుపట్టారా? ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తున్నాడు..

ఈ ఫొటోలోని సర్కిల్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను టాలీవుడ్ లో బాగా ఫేమస్. 2000లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ ఇప్పటివరకు పట్టుమని 10 సినిమాలు కూడా తీయలేదు. కానీ పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు

Tollywood: ఈ బక్కపల్చని మనిషిని గుర్తుపట్టారా? ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తున్నాడు..
Tollywood Director
Follow us
Basha Shek

|

Updated on: Dec 05, 2024 | 4:39 PM

ఈ ఫొటోలోని సర్కిల్ లో బక్కపల్చగా సింపుల్ గా కనిపిస్తోన్న వ్యక్తిని గుర్తు పట్టారా? ఇప్పుడు అతను టాలీవుడ్ లో బాగా ఫేమస్.. కాదు కాదు.. దేశంలోనే బాగా పాపులర్. అలాగనీ అతను స్టార్ హీరో కాదు. ఫేమస్ననటుడు కూడా కాదు. కానీ వీటన్నిటికి మించి సినిమా 24 క్రాఫ్ట్స్ లో ఒకటి ఉంటది. అదే కెప్టెన్ ఆఫ్ ది షిఫ్. యస్.. పై ఫొటోలో ఉన్నది టాలీవుడ్ కు చెందిన ఒక పాన్ ఇండియా డైరెక్టర్. ప్రస్తుతం ఎక్కడ చూసినా అతని పేరు మార్మోగిపోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీలోనూ ఈ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. లెక్కల మాస్టారిగా కెరీర్ ప్రారంభించి బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తోన్న ఈ డైరెక్టర్ ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్.. ఇక్కడ ఉన్నది మరెవరో కాదు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్. ఇది ఆయన టీచర్ గా పనిచేస్తున్నప్పటి ఫొటో. పుష్ప 2 ప్రభంజనం నేపథ్యంలో సుకుమార్ కు సంబంధించిన అరుదైన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

సినిమాల్లోకి రాకముందు కాకినాడలో ఓ పెద్ద కళాశాలలో లెక్కల అధ్యాపకుడిగా పని చేశారు సుకుమార్. అప్పటికే ఆయన జీతం సుమారు 75 వేలు. కానీ సినిమాలపై మక్కువతో 2000లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదట్లో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా పని చేశాడు. 2004లో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన ఆర్య సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక హీరో రామ్ పోతినేని తో జగడం తీసి టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఆర్య 2 నిరాశపర్చినా 100% లవ్ సూపర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు తో వన్ నేనొక్కడినే, ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో క్రియేటివ్ డైరెక్టర్ గా మారిపోయారు సుకుమార్. ఇక 2018 లో రామ్ చరణ్ తో రంగస్థలం తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇప్పుడు పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయారు.

ఇవి కూడా చదవండి

పుష్ప 2 ప్రి రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్..

View this post on Instagram

A post shared by Sukumar B (@aryasukku)

అల్లు అర్జున్ తో సుకుమార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.