Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: ఆస్పత్రి బెడ్‌పై షారుఖ్ ఖాన్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు విషయమిదే

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టంట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోల్లో షారుఖ్ ఆస్పత్రి బెడ్ పై ఉండడం అతని అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. వీటిని చూసిన వారందరూ షారుఖ్ కు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు.

Shah Rukh Khan: ఆస్పత్రి బెడ్‌పై షారుఖ్ ఖాన్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు విషయమిదే
Shah Rukh Khan
Follow us
Basha Shek

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 03, 2024 | 6:49 PM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇందులో షారుఖ్ ఖాన్ హాస్పిటల్ బెడ్‌పై ఉండడం అతని అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఈ ఫొటోను చూసిన వారందరూ షారుఖ్ కు ఏమైందని ఆరా తీయడం ఆరంభించారు. రూహి కౌశల్ అనే ఇన్ స్టా గ్రామ్ యూజర్ ఈ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. షారుఖ్ ఆస్పత్రిలో చేరాడని, అతని ఆరోగ్యం కోసం ప్రార్థించాలని అందులో కోరాడు. దీంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్ గామారింది. చాలా మంది నెటిజన్లు ఈ పోస్ట్ ను తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీంతో షారుఖ్ అభిమానులు బాగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ఫొటోలు ఇప్పటివి కావు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మే 22న అహ్మదాబాద్‌లోని KD హాస్పిటల్‌లో చేరారు. ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ కు వచ్చిన ఆయన డీహైడ్రేషన్ బారిన పడ్డాడు. దీంతో వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. ఆ సందర్భంలో తీసిన కొన్ని ఫొటోలను ఇప్పుడు మార్ఫింగ్ చేసి ఆస్పత్రిలో షారుఖ్ అనే క్యాప్షన్ తో మళ్లీ నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ఇది నిజమనుకుని షారుఖ్ అభిమానులు కలత చెందారు. అయితే ఇది అబద్ధమని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. పఠాన్, జవాన్, డుంకీ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు షారుఖ్ ఖాన్. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం తన కూతురు నటిస్తోన్న ఓ సినిమాలో నటిస్తున్నాడు షారుఖ్. సుజయ్ ఘోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ఇక షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు రెడీ అయ్యాడు. అయితే తండ్రిలా హీరో కాకుండా డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా ఒక ఆసక్తికర వెబ్ సిరీస్ తో. నెట్ ఫ్లిక్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. 2025లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.