- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Telugu Contestant Swethaa Varma Shares Emotional Post After Her Mother Demise
Bigg Boss : ‘నువ్వు లేని జీవితం ఏం బాగోలేదు’.. బిగ్ బాస్ బ్యూటీ ఇంట తీవ్ర విషాదం
గతంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొన్నప్రముఖ కంటెస్టెంట్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అంతకు ముందు పలు సినిమాల్లోనూ నటించి మెప్పించిన ఆమె సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో పలువురు సినీ ప్రముఖలు, అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
Updated on: Dec 02, 2024 | 10:04 PM

బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్వేతావర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు సినిమాల్లోనూ నటించిన ఆమె ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

శ్వేతా వర్మ తల్లి ఇటీవలే కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా పంచుకుని ఎమోషనలైంది.

'నీ కంపెనీ, ఉనికి నాకు బహుమతిగా అనిపిస్తుంది. నీలాంటి వాళ్లు ఎప్పటికీ నాకు దొరకరు. నేను, నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాం'.

'నువ్వు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు లేకుండా జీవితం ఏం బాలేదు' అని భావోద్వేగానికి లోనైంది శ్వేతా వర్మ.

'2017 డిసెంబర్ 2న 2:35 గంటలకు ఉదయం నన్ను వదిలేసి మా అమ్మ భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోయింది' అని మరో పోస్ట్ పెట్టింది శ్వేత.

దీంతో పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్వేతా వర్మకు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.




