- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun Follows Sentiment on Pre Release Event in Hyderabad Yousufguda Ground For Pushpa 2 The Rule
Allu Arjun-Pushpa 2: అల్లు వారబ్బాయికి అంత బాగా కలిసొచ్చిన చోటు.. అందుకే పుష్ప 2 ఈవెంట్ అక్కడ.!
ఒకసారి కలిసొచ్చిన సెంటిమెంట్ విడిచిపెట్టడానికి అంత ఈజీగా వదిలిపెట్టరు మన హీరోలు. అందులోనూ అద్భుతంగా కలిసొచ్చింది అయితే అస్సలు వదిలే ముచ్చటే లేదంటారు. అల్లు అర్జున్ ఇదే చేస్తున్నారిప్పుడు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కలిసొచ్చిన సెంటిమెంట్‌నే రిపీట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటది.? పుష్ప.. పుష్ప.. ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఎవరిని కదిపినా దీని గురించే చర్చ జరుగుతుంది.
Updated on: Dec 02, 2024 | 8:58 PM

ఒకసారి కలిసొచ్చిన సెంటిమెంట్ విడిచిపెట్టడానికి అంత ఈజీగా వదిలిపెట్టరు మన హీరోలు. అందులోనూ అద్భుతంగా కలిసొచ్చింది అయితే అస్సలు వదిలే ముచ్చటే లేదంటారు.

ఆరేళ్ళ తర్వాత మరో ఇండియన్ సినిమా 1700 కోట్లు వసూలు చేసింది.. అది కూడా కేవలం 21 రోజుల్లోనే..! ఇప్పటికే హిందీలో 740 కోట్లతో ఆల్‌టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2.

ఎవరిని కదిపినా దీని గురించే చర్చ జరుగుతుంది. మరో రెండు మూడు రోజుల్లోనే సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచారు మేకర్స్.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఈవెంట్స్ చేసిన పుష్ప 2 టీం.. తాజాగా తెలుగులో ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే డిసెంబర్ 2న ఈ వేడుక జరగనుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలోనూ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 టీం. హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ బన్నీకి బాగా కలిసొచ్చిన వేదిక.

గతంలో అల వైకుంఠపురములోతో పాటు పుష్ప ఈవెంట్స్ ఇక్కడే జరిగాయి. అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్ కాగా.. మరో సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయ్యారు అల్లు అర్జున్.

అల్లు వారబ్బాయికి అంత బాగా కలిసొచ్చిన చోటే పుష్ప 2 ఈవెంట్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ భారీ స్థాయిలో జరగనుంది. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై ఈవెంట్స్ సూపర్ హిట్ అయ్యాయి.

తెలుగులోనూ ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ సక్సెస్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మొత్తానికి కలిసొచ్చిన గ్రౌండ్‌లో రప్ఫాడించడానికి వచ్చేస్తున్నారు పుష్పరాజ్.




