Rakul Preet Singh: ఇంకో రెండు వారాలు.. తప్పదంటున్న రకుల్‌.! గ్లామర్ డోస్ మాత్రం వేరే లెవల్..

నేనింకా కోలుకోలేదు అని క్లారిటీగా చెప్పేశారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇంకో రెండు వారాలు పూర్తయ్యాకే మామూలు మనిషినయ్యే అవకాశం ఉందన్నారు. అప్పుడెప్పుడో నడుం పట్టేసిందన్న రకుల్‌.. ఇంకా ఆ పెయిన్‌తోనే ఇబ్బంది పడుతున్నారా? ఇంకేమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా.? అక్టోబర్‌ 5.. నేను నా జీవితంలో ఏమాత్రం ఊహించని రోజు. గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు అని అంటున్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

Anil kumar poka

|

Updated on: Dec 02, 2024 | 8:47 PM

నేనింకా కోలుకోలేదు అని క్లారిటీగా చెప్పేశారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇంకో రెండు వారాలు పూర్తయ్యాకే మామూలు మనిషినయ్యే అవకాశం ఉందన్నారు.

1 / 8
అప్పుడెప్పుడో నడుం పట్టేసిందన్న రకుల్‌.. ఇంకా ఆ  పెయిన్‌తోనే ఇబ్బంది పడుతున్నారా? ఇంకేమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా.?

2 / 8
అక్టోబర్‌ 5.. నేను నా జీవితంలో ఏమాత్రం ఊహించని రోజు. గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు అని అంటున్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

3 / 8
ఆ రోజు ఉదయం దాదాపు 80 కిలోల వెయిట్‌ ఎత్తారట రకుల్‌. అప్పుడే వెన్ను నొప్పి మొదలైనా పట్టించుకోకుండా వర్కవుట్స్ కంటిన్యూ చేసి షూటింగ్‌కి వెళ్లారు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చే సరికి విపరీతమైన వెన్ను నొప్పి.. అదే తగ్గుతుందిలే అని అశ్రద్ధ చేశారు.

4 / 8
ఓ ఐదు రోజులు గడిచే సరికి పెయిన్‌ పెరిగి, బీపీ డౌన్‌ అయింది. పది రోజుల పాటు హాస్పిటల్‌లో ఉన్నారు రకుల్‌. ఆ ట్రీట్‌మెంట్లో ఉండగానే ఆమె బర్త్ డే వచ్చింది. ఎన్నెన్నో సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేశారు భర్త జాకీ భగ్నాని.

5 / 8
కానీ, పార్టిసిపేట్‌ చేయలేకపోయారు రకుల్‌. కాసేపు ఒక్క చోట కూర్చోకుండా చలాకీగా తిరిగే రకుల్‌, అన్ని రోజులు బెడ్‌ రెస్ట్ తీసుకోవడాన్ని నరకంగా ఫీలయ్యారు. ఏదీ మొండిగా చేయకూడదన్నది నాకు లైఫ్‌ నేర్పించిన పాఠం అంటారు రకుల్‌.

6 / 8
అంతే కాదు, ఇంకో రెండు వారాలు రెస్ట్ తీసుకుంటేగానీ, తాను ఎంత మేర కోలుకున్నాననే విషయం మీద అవగాహన రావడం కష్టం అంటున్నారు. ఈ మధ్య ఫ్లైట్‌ ఎక్కుతుంటే కన్నీళ్లు వచ్చేశాయని, జీవితం క్షణికం అనే మాటకు అర్థం తెలిసిందని చెప్పారు రకుల్‌.

7 / 8
ఇంకో రెండు వారాల్లో నార్మల్‌ అయిపోతాననే ఆశ నన్ను నడిపిస్తోంది. గంటల్నీ, రోజుల్నీ లెక్కబెడుతున్నాను. మునుపటిలా చెంగుచెంగుమని ఎగురుతూ ఉండాలనిపిస్తోందన్నా అన్నారు రకుల్‌. ఈమె గత కొన్నాళ్లుగా నార్త్ ప్రాజెక్టుల మీదే ఫోకస్‌ పెంచి, సౌత్‌కి నెమ్మదిగా దూరమవుతున్నారు.

8 / 8
Follow us