Tollywood: ‘ట్విన్స్ పుట్టారు’.. శుభవార్త చెప్పిన ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

మాతృత్వంతోనే ఒక మహిళ జీవితం పరిపూర్ణం అవుతుందంటారు. అందుకే ఆడోళ్లు అమ్మగా ప్రమోషన్ పొందినప్పుడు వారిలో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడిదే మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్.

Tollywood: 'ట్విన్స్ పుట్టారు'.. శుభవార్త చెప్పిన ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Dec 03, 2024 | 3:32 PM

గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శ్రద్ధా ఆర్య శుభవార్త చెప్పింది. అమ్మగా ప్రమోషన్ పొందానంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) పుట్టారంటూ ఒక అందమైన వీడియోను పోస్ట్ చేసింది. నవంబర్ 29న తనకు ప్రసవం జరిగిందని ఇప్పుడు అందరమూ క్షేమంగానే ఉన్నామంటూ అందులో చెప్పుకొచ్చింది. ‘ ఈరెండు చిన్ని హృదయాలు మా కుటుంబాన్ని పూర్తి చేశాయి. మా మనసులు రెండింతల సంతోషంతో నిండిపోయింది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది శ్రద్ద. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్రద్ధా ఆర్య దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పంజాబ్ కు చెందిన శ్రద్ధ 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హిందీలో నిశ్శబ్ద్‌ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.

2007లో గొడవ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైంది శ్రద్ధ. కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో వైభవ్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో శ్రద్దా ఆర్య అందం, అభినయానికి యూత్ ఫిదా అయిపోయారు. దీని తర్వాత రోమియో, కోతిమూక తదితర తెలుగు సినిమాల్లో నటించింది శ్రద్ధ. అయితే ఎందుకో గానీ ఆ తర్వాత మరే తెలుగు సినిమాల్లోనూ కనిపించలేదీ అందాల తార. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించిన శ్రద్ధ 2021లో నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్‌తో కలిసి ఏడడుగులు వేసింది.

ఇవి కూడా చదవండి

ఎమోషనల్ వీడియో షేర్ చేసిన శ్రద్ధ..

View this post on Instagram

A post shared by Shraddha Arya (@sarya12)

2021 నవంబర్‌లో శ్రద్ధ- రాహుల్ ల వివాహం జరిగింది. తమ దాంపత్య బంధానికి ప్రతీకగా ఈ ఏడాది అక్టోబరులో ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తనకు ఓ అబ్బాయి,అమ్మాయి పుట్టారన్న శుభవార్తను పంచుకుందీ అందాల తార.  కాగా  ‘తుమ్‌హారి పాఖి’, ‘కుండలి భాగ్య’, ‘డ్రీమ్ గర్ల్’ లాంటి సీరియల్స్‌లో నటించి బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది శ్రద్ధ. ఇక సినిమాల విషయానికి వస్తే..  ఆమె బాలీవుడ్‌లో చివరిసారిగా రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీలో మెరిసింది.

సీమంతం వేడుకల్లో..

View this post on Instagram

A post shared by Shraddha Arya (@sarya12)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.