AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikrant Massey: కెరీర్ పీక్స్‌లో ఉండగానే నటనకు గుడ్ బై.. 12th ఫెయిల్ హీరో ఆస్తుల వివరాలివే

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్రాంత్‌ మాస్సే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ట్యాలెంటెడ్ నటునిగా గుర్తింపు, క్రేజ్ ఉన్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేయడం అందరినీ ఆశ్చర్యానికి నిజం చెప్పాలంటే షాక్‌కు గురి చేసింది.

Vikrant Massey: కెరీర్ పీక్స్‌లో ఉండగానే నటనకు గుడ్ బై.. 12th ఫెయిల్ హీరో ఆస్తుల వివరాలివే
Vikrant Massey
Basha Shek
|

Updated on: Dec 02, 2024 | 9:13 PM

Share

బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే నటనకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. 2025లో విడుదల కానున్న తన రెండు సినిమాలు తన చివరి సినిమాలని, ఆ తర్వాత విరామం తీసుకుంటానన్నాడు విక్రాంత్. వెర్సటైల్ యాక్టర్ గా ఫుల్ క్రేజ్, చేతి నిండా సినిమాలు ఉన్న సమయంలోనే ఇలా నటనకు గుడ్ బై చెబుతూ విక్రాంత్ తీసుకున్న నిర్ణయం వెనక కారణాలను విశ్లేషిస్తున్నారు చాలా మంది. అదే సమయంలో అతని జీవన శైలి, ఆస్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. విక్రాంత్ తన నట జీవితాన్ని బుల్లితెరతో ప్రారంభించాడు. ఆ తరువాత బాలీవుడ్, ఓటీటీల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విక్రాంత్ సినిమా ‘ది సబర్మతి రిపోర్ట్’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. ఇదే కాదు ఇప్పటివరకు విక్రాంత్ నటించిన సినిమాలన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నవే.

కాగా 37 ఏళ్ల విక్రాంత్ ఇప్పటివరకు తన కెరీర్‌లో కీర్తితో పాటు కోట్లాది ఆస్తులను సంపాదించాడు. ఈ టైమ్స్ ప్రకారం, విక్రాంత్ ఆస్తుల నికర విలువ రూ.20 కోట్ల నుంచి రూ.26 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. విక్రాంత్ ఒక్కో సినిమాకు కోటి నుంచి రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. తన సంపాదనలో ఎక్కువ భాగం సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వచ్చిందే. ఇక 2020లో, విక్రాంత్ ముంబైలో సముద్రానికి ఎదురుగా ఉన్న విలాసవంతమైన ఇంటిని కూడా కొనుగోలు చేశాడు. అతను తన భార్య శీతల్ ఠాకూర్, కుమారుడు వరదన్‌తో కలిసి ఇక్కడ నివసిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

భార్య, కుమారుడితో విక్రాంత్ మాస్సే..

గ్యారేజ్ లో లగ్జరీ కార్లు..

విక్రాంత్‌కి కార్ల సేకరణ అంటే చాలా ఇష్టం. రూ. 1.16 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్, రూ. 60 లక్షల విలువైన వోల్వో ఎస్90, మారుతి స్విఫ్ట్ డిజైర్ వంటి అనేక లగ్జరీ కార్లు అతని గ్యారేజ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా 12 లక్షల రూపాయల విలువైన డుకాటి మాన్‌స్టర్ మోటార్‌ బైక్ , రూ. 12.35 లక్షల ధర కలిగిన ట్రయంఫ్ బోన్నెవిల్లే బాబర్ బైక్ కూడా విక్రాంత్ దగ్గర ఉన్నాయి. మొత్తానికి విక్రాంత్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని అర్థమవుతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!