Naga Chaitanya- Sobhita:నాగచైతన్య, శోభిత పెళ్లి.. కాబోయే కోడలికి నాగార్జున ఏమేం కానుకలు ఇస్తున్నారో తెలుసా?

అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభితల వివాహ ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది. డిసెంబర్ 04న అన్న పూర్ణ స్డూడియోలో వీరి వివాహం జరగనుంది. ఇందుకోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Naga Chaitanya- Sobhita:నాగచైతన్య, శోభిత పెళ్లి.. కాబోయే కోడలికి నాగార్జున ఏమేం కానుకలు ఇస్తున్నారో తెలుసా?
Naga Chaitanya, Sobhita Dhulipala
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2024 | 10:50 AM

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం (నవంబర్ 29) ఇరు కుటుంబాల ఇంట్లో హల్దీ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. వధూవరులిద్దరికీ మంగళ స్నానాలు చేయించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ వేడుకల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. అదే సమయంలో కాబోయే కోడలికి అక్కినేని కుటుంబీకులు ఇవ్వబోయే కానుకలు, బహుమతుల గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా నాగార్జున ఇటీవల టయోటా లెక్సస్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. నాగ చైతన్య పెళ్లి కోసమే సుమారు పెట్టి ఈ కారు కొన్నాడని తెలిసింది. అయితే ఇది శోభితకు బహుమతిగా ఇవ్వడం కోసమే కొన్నారనే తెలుస్తోంది. దీంతో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాలను కూడా శోభితకు అక్కినేని ఫ్యామిలీ కానుకలుగా ఇవ్వనున్నారట.

కాగా హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి నాగార్జున కారుతో వచ్చారు.  కారు రిజిస్టర్ చేసుకున్న అనంతరం అభిమానులతో పోజులిచ్చాడు. నాగార్జున కొనుగోలు చేసిన కొత్త కారు ధర దాదాపు రెండున్నర కోట్ల రూపాయలని అంటున్నారు. రణబీర్ కపూర్ కూడా ఇంతకు ముందు ఈ కారును కొన్నాడు. ఈ కారు సెలబ్రిటీలకు ఇష్టమైన కారు. ఇప్పుడిదే లగ్జరీ కారును శోభితకు కానుకగా నాగ్ ఇవ్వనున్నారని సమాచారం.  వీటిపై అటు నాగార్జున, ఇటు శోభిత కుటుంబీకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

హల్దీ వేడుకల్లో శోభిత ధూళిపాళ్ల..

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

మరోవైపు కాబోయే అల్లుడికి శోభిత తల్లిదండ్రులు భారీగానే కట్నకానుకలు ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది. నాగచైతన్యకు ఒక ఆడీ కారుతో పాటు స్పోర్ట్స్‌ బైక్‌ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా హైదరాబాద్‌లోనే ఓ లగ్జరీ విల్లాను కూడా ఇవ్వనున్నారట. అయితే అక్కినేని కుటుంబం తమకు ఎలాంటి డబ్బు, నగలు అవసరం లేదని, తమ కొడుకుకి భార్యగా, చక్కటి ఇల్లాలుగా, జీవితాంతం తోడునీడుగా ఉంటే చాలని శోభిత కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.