Tollywood: టెన్త్, ఇంటర్‌లో టాపర్.. ఇప్పుడు సినిమాకు 30 కోట్లు.. ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం మనుగడ సాగించాలంటే స్కిన్ షో చేయాల్సిందే, స్టార్ హీరోల పక్కన గ్లామర్ ఒలకబోయాల్సిందేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే అలా చేయకున్నా స్టార్ హీరోయిన్ గా ఎదగవచ్చని నిరూపించిందీ అందాల తార.

Tollywood: టెన్త్, ఇంటర్‌లో టాపర్.. ఇప్పుడు సినిమాకు 30 కోట్లు.. ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2024 | 10:13 AM

సాధారణంగా మన సినిమా కథలన్నీ హీరో చుట్టూనే తిరుగుతుంటాయి. దర్శకులు కూడా కథానాయకులకు తగ్గట్టుగానే కథలు రాసుకుంటారు. ఇక హీరోయిన్ల విషయం అంటారా? జస్ట్ సాంగ్స్ లో హీరో పక్కన రెండు స్టెప్పులేయడం, రొమాన్స్ చేయడం, గ్లామర్ ఒలకబోయడం లాంటివితోనే సరిపెట్టుకుంటారు. అయితే చాలామంది హీరోయిన్లు వీటికి అసలు ఒప్పుకోరు. సినిమాలో హీరోతో పాటు తమ రోల్ కు కూడా ప్రాధాన్యం ఉండాల్సిందేనంటారు. సరిగ్గా ఈ కోవకే చెందుతుందీ క్రేజీ హీరోయిన్. అందుకే ఆమెకు బాక్సాఫీస్ క్వీన్ అన్న బిరుదు కూడా వచ్చింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయకున్నా స్టార్ హీరోల సినిమాల్లోనే నటిస్తూ లేడీ పవర్ స్టార్ అన్న ట్యాగ్ తో అందరి అభిమానం చూరగొంటోన్నఆ హీరోయిన్ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు ఇటీవలే అమరన్ తో మరో బ్లాక్ బస్టర్ సినిమా ఖాతాలో వేసుకున్న న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఇది ఆమె స్కూల్ డేస్ నాటి ఫొటో.

కాగ సాయిపల్లవి కేవలం నటనలోనే కాదు.. చదువులోనూ తోపే. ఆమెకు పదో తరగతిలో 80 శాతం, ఇంటర్మీడియెట్ లో 85 శాతం మార్కులు వచ్చాయట. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కన్న ఆమె ఇంటర తర్వాత ఎంబీబీఎస్ చేసి డాక్టర్ పట్టా కూడా పొందింది. అయితే అనూహ్యంగా సినిమాల్లో ఛాన్స్ రావడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఇవి కూడా చదవండి

అమరన్ సినిమాలో సాయి పల్లవి..

ఇటీవలే అమరన్ తో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అలాగే రామాయణం సినిమాలోనూ సీతగా నటిస్తుంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా 3 పార్టులకు గానూ సాయి పల్లవి రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.