Bigg Boss: ‘నన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేయండి’.. శోభా శెట్టి కన్నీళ్లు.. ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 13 వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఫినాలే టు టాస్క్ హోరా హోరీగా సాగుతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాగే కన్నడలో కూడా బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ప్రస్తుతం అక్కడ 11వ సీజన్ నడుస్తోంది. ఈ కన్నడ రియాలిటీ షో ప్రారంభమై సుమారు 50 రోజులకు పైగా అయ్యింది. మెయిన్ కంటెస్టెంట్స్ కు తోడు టీవల ఇద్దరు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి అడుగు పెట్టారు. అందులో బిగ్ బాస్ తెలుగు ఫేమ్, కార్తీక దీపం మోనిత అలియాస్ శోభా శెట్టి కూడా ఉంది. అలాగే రజత్ అనే మరో కంటెస్టెంట్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అతను ఇప్పుడు హౌస్ లో టాప్ కంటెస్టెంట గా ఉన్నాడు. ఈ సీజన్‌లో రజత్ విజేతగా నిలుస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే రజత్‌తో పాటు వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టిన శోభాశెట్టి బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోతోంది. హౌస్‌లోకి వచ్చిన మొదట్లో ఫుల్ జోష్ లో ఉన్నట్లు కనిపించిన మోనిత ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. తనను బిగ్ బాస్ నుంచి బయటకు పంపించాలని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఈ వారం శోభా శెట్టి నామినేషన్స్ లో నిలిచింది. కానీ ఆడియెన్స్ ఆమెకు ఓటు వేసి కాపాడారు. అయితే శోభాశెట్టి మాత్రం ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటోంది. ఈ విషయాన్ని సుదీప్ ముందు చెప్పిన శోభాశెట్టి.. తనను బయటకు పంపించేయాలని దీనంగా వేడుకుంది.
దీంతో శోభాశెట్టికి సుదీప్ సలహా ఇస్తూ.. ‘ఈ బిగ్ బాస్ హౌస్ లోనికి రావడానికి ఉద్దేశ్యం ఏంటో ఒకసారి ఆలోచించు’ అన్నాడు. ఆ తర్వాత ‘మీకు ఓట్లు వేసిన ఆడియెన్స్ కు అన్యాయం చేస్తున్నారంటే ఏం చెబుతారు?’ అయినా సరే, శోభాశెట్టి తాను బయటకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టింది. ఎట్టకేలకు శోభాశెట్టి మాటలకు చలించిన సుదీప్.. బిగ్ బాస్ హౌస్ తలుపులు తెరిచాడు. అయితే శోభాశెట్టి బయటకు వెళ్లిందా లేదా అనేది ఆదివారం రాత్రి ఎపిసోడ్ తో క్లారిటీ రానుంది.
బిగ్ బాస్ కన్నడ లేటెస్ట్ ప్రోమో..
ಸೂಪರ್ ಸಂಡೇ ವಿತ್ ಬಾದ್ಷಾ ಸುದೀಪ | ಇಂದು ರಾತ್ರಿ 9 #BiggBossKannada11 #BBK11 #HosaAdhyaya #ColorsKannada #BannaHosadaagideBandhaBigiyaagide #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #Kicchasudeepa #BBKPromo pic.twitter.com/ypkz2sfD2t
— Colors Kannada (@ColorsKannada) December 1, 2024
ఆదివారం ఎపిసోడ్‌లో, శోభా శెట్టి తాను ఇంటి నుండి వెళ్లిపోతానని సుదీప్ ముందు పట్టుబట్టింది. సుదీప్ కూడా బిగ్ బాస్ గేటు తెరిచాడు. మరి శోభాశెట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఆదివారం రాత్రి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.