- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Fame Rocking Rakesh Family Visits Kasi Vishwandha temple With Roja And Ravali, See Photos
Rocking Rakesh: కాశీ యాత్రలో జబర్దస్త్ దంపతులు.. రోజాతో కలిసి కార్తీక మాస పూజలు.. ఫొటోస్ ఇదిగో
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ ) సినిమా ఇటీవలే విడుదలై ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో వీర కాశీ వెళ్లి విశ్వేశ్వరున్ని దర్శనం చేసుకున్నారు. వీరి వెంట మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు
Updated on: Dec 02, 2024 | 4:55 PM

జబర్దస్త్ దంపతులు రాకింగ్ రాకేష్, సుజాత కాశీ విశ్వేశ్వరున్ని దర్శించుకున్నారు. మాజీ మంత్రి రోజా కూడా వీరి వెంట ఉన్నారు.

అలాగే అలనాటి క్రేజీ హీరోయిన్, పెళ్లి సందడి సినిమా నటి రవళి కూడా వీరి వెంట ఉన్నారు. తమ కాశీ యాత్ర ఫొటోలను రాకింగ్ రాకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

'కాశీలో కార్తీకమాస పర్వదినాన విజయోత్సవం. ఈ విజయం నిజంగానే ఆ జంగముడేసిన దారే. ఆ దారిలో మీ అందరి ఆశీర్వాదాలు మీరిచ్చిన ప్రేమ వల్లనే నా సినిమా ఇంత విజయం కాగలిగింది'

'మీ అందరి ప్రేమ ఎప్పుడూ నా మీద ఇలానే ఉండాలని కోరుకుంటూ ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి సర్వేజనా సుఖినోభవంతు' అని తన ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు రాకింగ్ రాకేష్.

ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) లో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు రాకింగ్ రాకేష్. సీనియర్ నటి సత్య కృష్ణన్ కూతురు అన్నన్య కృష్ణన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది




