- Telugu News Photo Gallery Cinema photos Sri Aditya Luxury Vantage Presents Hyderabad Times fashion week 2024
Times Fashion Week 2024: ఆకట్టుకున్న హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్.. ఫోటోస్ వైరల్..
బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో నవంబర్ 30, డిసెంబర్ 1న హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ జరుగుతుంది. ఈరోజు ప్రారంభమైన ఈ ఫ్యాషన్ వీక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Updated on: Nov 30, 2024 | 9:55 PM

హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్' ఆకట్టుకుంది. శ్రీ ఆదిత్య లగ్జరీ వాన్టేజ్ సమర్పణలో రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా మొదటి రోజు థీమ్ లతో ప్రముఖ డిజైనర్ అర్జెంటుమ్ ఆర్ట్స్ రాజ్ దీప్ రణవ్ట్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపు పై ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ర్యాంపును అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు లక్ష్మీ. రెడ్డి, వస్త్రలేఖ, మంగళగౌరి, ఆదరణ, విశిష్ట గోల్డ్ & డైమండ్స్, యక్షి దీప్తి రెడ్డి, అంజలీ, అర్జున్ కపూర్ ప్రముఖ డిజైనర్స్ లకు చెందిన డిజైన్ కలేషన్స్ అందించారు.

ఈ కలెక్షన్లను ప్రముఖ సినీ తారలు మానస వారణాసి, సీరత్ కపూర్, ప్రజ్ఞ అయ్యగరి, మాళవిక మోహన్, నేహా శెట్టి షో స్టాపర్స్ గా మెరిచారు.

ఈ షో లో మోడల్స్ వావ్ అనిపించారు. దాదాపు 16 మంది డిజైనర్లు రూపొందించిన సరి కొత్త డిజైన్లను ఈ రెండు రోజుల ప్రదర్శనలో చూపనున్నారు.

నగరంతో పాటు ముంబై ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్ పలువురు ఇక్కడ ర్యాంపుపై సందడి చేశారు. ఈరోజు ప్రారంభమైన ఈ ఫ్యాషన్ వీక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.




