- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress In This Photo She Is Heroine Keerthy Suresh
Tollywood: తస్సాదియ్యా… ఏం ఛేంజ్ గురూ.. ఈ అమ్మడు ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీ అంటే నమ్మగలరా..?
సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనకు ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ గెలుచుకుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? సినిమాల్లోకి రాకముందు ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
Updated on: Dec 01, 2024 | 2:49 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ వయ్యారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తెలుగు, తమిళం సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు రెడీ అయ్యింది.

ఆమె మరెవరో కాదండి హీరోయిన్ కీర్తి సురేష్. నేను శైలజా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మహానటి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది. కీర్తి సురేష్ ఇటు ఎన్న మాయం చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది.

కీర్తి సురేష్ తమిళంలోనే కాకుండా మలయాళం, తెలుగు వంటి పాన్-ఇండియన్ భాషలలో నటించింది. సుమన్ కుమార్ దర్శకత్వంలో రఘుదత్తా చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది.

కీర్తి సురేష్ ప్రస్తుతం రివాల్వర్ రీటా చిత్రంలో నటిస్తోంది. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం హిందీలో హీరో వరుణ్ ధావన్ సరసన ఓ ప్రాజెక్టులో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవలే తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెలలో తాను వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపింది. తన స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకోనుందట. వీరిద్దరు 15 ఏళ్లుగా స్నేహితులు.




