- Telugu News Photo Gallery Cinema photos Hero Naga Chaitanya and Sobhita Dhulipala Wedding on 04 December 2024, Details Here
Naga Chaitanya-Sobhita: పెళ్లికళ వచ్చేసిందే బాలా.! పాటలు పాడుకుంటున్న స్టార్స్..
నాగచైతన్య - శోభాతా దూళిపాళ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి వేడుక జరుగనుంది. ఈ నేపథ్యంలో తమ ప్రేమ కథను రివీల్ చేశారు నాగచైతన్య. శోబితతో పరిచయం, ప్రేమ ఎప్పుడు ఎలా జరిగాయో రివీల్ చేశారు. ప్రస్తుతం పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న నాగచైతన్య, తన ప్రేమకథను రివీల్ చేశారు. ఒక్క సినిమా కూడా కలిసి వర్క్ చేయకపోయినా.. శోభితతో ఎలా పరిచయం ఏర్పడిందో రివీల్ చేశారు.
Updated on: Dec 01, 2024 | 4:44 PM

నాగచైతన్య - శోభాతా దూళిపాళ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి వేడుక జరుగనుంది.

ఈ నేపథ్యంలో తమ ప్రేమ కథను రివీల్ చేశారు నాగచైతన్య. శోబితతో పరిచయం, ప్రేమ ఎప్పుడు ఎలా జరిగాయో రివీల్ చేశారు.

ప్రస్తుతం పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న నాగచైతన్య, తన ప్రేమకథను రివీల్ చేశారు. ఒక్క సినిమా కూడా కలిసి వర్క్ చేయకపోయినా.. శోభితతో ఎలా పరిచయం ఏర్పడిందో రివీల్ చేశారు.

ఓ ఓటీటీ ఈవెంట్‌లో శోభితను తొలిసారి కలిశా అన్నారు చైతన్య. ఆ ఈవెంట్‌లోనే ఆమెతో పరిచయం ఏర్పడిందని, చాలా సేపు సరదాగా మాట్లాడుకున్నామని చెప్పారు.

కొన్ని నెలల్లోనే పరిచయం కాస్త ప్రేమగా మారిందని ఆ విషయం చాలా రోజుల క్రితమే ఇరు కుటుంబాలకు తెలుసని వెళ్లడించారు. ఇరు కుటుంబాలు చాలా సార్లు కలుసుకున్నాయని చెప్పారు.

అంతేకాదు శోభిత ఫ్యామిలీ తనను ఓ కొడుకులా ట్రీట్ చేస్తుందన్నారు చై. రిలేషన్‌షిప్ గురించి ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడ్డ చై, శోభిత..

ఆగస్టులో నిశితార్థం ఎనౌన్స్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. తమ ఫ్యామిలీ సెంటిమెంట్‌గా భావించే అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

డిసెంబర్ 4న ఈ వేడుక ఘనంగా జరగనుంది. చైతూ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీ తండేల్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.




