- Telugu News Photo Gallery Cinema photos Director Lokesh Kanagaraj plans Teaser from Superstar Rajinikanth Coolie Movie, Details Here
Rajinikanth: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి లోకేష్ స్పెషల్ గిఫ్ట్.! తలైవా ప్లాన్ అదుర్స్..
తలైవర్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఇప్పుడు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశారు. ఇంకెంత.. ఈ వారం, వచ్చే వారం.. అంతే.. ఆ తర్వాత చూడండి.. సీన్ మామూలుగా ఉండదని అంటున్నారు. ఇంతకీ ఏంటి వాళ్ల ఖుషీకి కారణం.. కూలీ మూవీ టైటిల్ టీజర్ చూసినప్పటి నుంచీ.. ఈ సినిమా ఏమై ఉంటుందనే గెస్సింగ్ కంటిన్యూ అవుతోంది. పూర్తిగా బ్లాక్ షేడ్స్.. వాటి మీద గోల్డ్ ఆర్టికల్స్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే షాట్స్.. యమాగా ఉంది టీజర్.
Updated on: Dec 01, 2024 | 5:05 PM

అందుకోసం ఆయన కొన్నాళ్ల పాటు మేకోవర్ టైమ్ తీసుకోవాలని ఫిక్సయ్యారట. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా పనుల్లో ఉన్నారు రజనీకాంత్. కూలీ షూటింగ్ పూర్తి కాగానే, ఇమీడియేట్‌గా జైలర్2 సెట్స్ కి వెళ్లడం లేదు.

ఇంతకీ ఏంటి వాళ్ల ఖుషీకి కారణం.. కూలీ మూవీ టైటిల్ టీజర్ చూసినప్పటి నుంచీ.. ఈ సినిమా ఏమై ఉంటుందనే గెస్సింగ్ కంటిన్యూ అవుతోంది.

పూర్తిగా బ్లాక్ షేడ్స్.. వాటి మీద గోల్డ్ ఆర్టికల్స్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే షాట్స్.. యమాగా ఉంది టీజర్. ఇప్పుడు దాన్ని మించేలా ప్లాన్ చేస్తున్నారు లోకేష్.

డిసెంబర్ 12న రజనీకాంత్ బర్త్ డే రోజు.. ఫ్యాన్స్ కి ట్రీట్ మామూలుగా ఉండదు. మళ్లీ మళ్లీ గుర్తుచేసుకునేలా గిఫ్ట్ రెడీ చేస్తున్నారు లోకేష్ కనగరాజ్.

జస్ట్ లోకేష్ మాత్రమే కాదు.. నెల్సన్ కూడా వా నువ్వు కావాలయ్యా అని అనడానికి సిద్ధమవుతున్నారు.

కూలీ సినిమాలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్ చేయబోతున్నారన్నది సౌత్, నార్త్ సర్కిల్స్‌లో ట్రెండింగ్ టాపిక్. త్వరలో స్టార్ట్ అవ్వబోయే జైపూర్ షెడ్యూల్‌లోనే ఈ కాంబోకు సంబంధించిన సీన్స్ షూట్ చేయబోతున్నారట.

బ్లాక్ బస్టర్ జైలర్‌లో బాలీవుడ్ టచ్ మిస్ అయినా.. లేటెస్ట్ మూవీ వేట్టయన్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌నే రంగంలోకి దించారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న కూలీ సినిమాలోనూ ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ కనిపించబోతున్నారన్న న్యూస్ చాలా రోజులుగా వైరల్ అవుతోంది.




