Ajaz Khan: సినిమా ఇండస్ట్రీలో సంచలనం.. టాలీవుడ్ నటుడి భార్య అరెస్ట్.. కారణమిదే
'బిగ్ బాస్' ఫేమ్, ప్రముఖ నటుడు అజాజ్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హిందీ సినిమాల్లో ఎక్కువ కనిపించినప్పటికీ రక్తచరిత్ర, దూకుడు, బాద్‌షా, నాయక్, హార్ట్ ఎటాక్ తదితర తెలుగు సినిమాల్లో విలన్‌గానూ నటించి మెప్పించాడు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు అజాజ్ ఖాన్ ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు పొంది ఘోర పరాజయం పాలైన ఈ నటుడు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ముంబై డ్రగ్స్ కేసులో అజాజ్ ఖాన్ భార్య ఫాలన్ గులివాలాను పోలీసులు అరెస్ట్ చేశారు. జోగేశ్వరిలోని ఆమె ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఫాలన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 8న కస్టమ్స్ విభాగం అజాజ్ ఖాన్ కార్యాలయంపై దాడులు చేసింది. రూ.35 లక్షల విలువైన 10 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ కేసులో ఫాలన్ గులివాలా హస్తం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అజాజ్ ఖాన్ భార్య ఫాలోన్ గులీవాలా అరెస్ట్ తర్వాత పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. డ్రగ్ కేసును విచారించేందుకు ఫాలన్ ఇల్లు, ఆఫీసులో సోదాలు జరిగాయి. నటుడి భార్యను విచారణ నిమిత్తం అరెస్టు చేశారు. అజాజ్‌ఖాన్‌ను ఇంకా విచారణకు పిలవలేదని పోలీసులు తెలిపారు.
కాగా గతంలో పలు సార్లు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు అజాజ్ ఖాన్. 2021లో ఈ నటుడి వద్ద 31 ఆల్ప్రాజోలం మాత్రలు దొరికాయి. దీంతో సదరు నటుడిపై చర్యలు తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇజాజ్ ఖాన్ 2 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన తర్వాత విడుదలయ్యాడు. ఇదొక్కటే కాదు అభ్యంతరకరమైన పోస్టులు, దురుసు వ్యాఖ్యలతో పలు సార్లు జైలు శిక్ష అనుభవించాడీ యాక్టర్.
అజాజ్ ఖాన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
హిందీ బిగ్‌బాస్ 7, 8వ సీజన్స్‌లో కంటెస్టెంట్ గ పాల్గొన్న అజాజ్ ఖాన పలు హిందీ సినిమాల్లోనూ మెరిశాడు. ఇక రక్త చరిత్ర 2 సినిమాతో టాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టాడు. ఆ తర్వాత దూకుడు, బాద్ షా, నాయక్, టెంపర్, వేట తదితర సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించాడు.
తరచూ వివాదాల్లో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.