Pushpa 2: అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపుతోన్న పుష్ప 2.. ఇప్పటివరకు ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయో తెలుసా?
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రికార్డుల వేట షురూ అయ్యింది. రిలీజ్ కు ముందే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో శనివారం (నవంబర్ 30) పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా లక్షలాది టికెట్లు సేల్ అయ్యాయి.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ విడుదలకు మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభంకాగా శనివారం(నవంబర 30) మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో శనివారం పుష్ప 2 టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సినీ అభిమానులు అల్లు అర్జున్ మూవీ టికెట్లు బుక్ చేసుకునేందుకు తెగ పోటీ పడుతున్నారు. ఈక్రమంలో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో టిక్కెట్లు బుక్ అయ్యాయి. పుష్ప 2 టికెట్ అడ్వాన్స్ బుకింగ్ స్పీడ్ చూస్తుంటే ప్రభాస్ ‘బాహుబలి 2’ రికార్డును ‘పుష్ప 2’ సినిమా బద్దలు కొట్టే అవకాశాలున్నాయని సినీ పండితులు చెబుతున్నారు. కాగా ఆంధ్రా, తెలంగాణా, కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిన్న బుకింగ్ ప్రారంభం కాలేదు. తెలంగాణలో సాయంత్రం స్టార్ట్ కాగా, కేరళలో ఆదివారం (డిసెంబర్ 0) అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అయినా నిన్న ఒక్క భారతదేశంలోనే మల్టీప్లెక్స్‌లలో 55,000 కంటే ఎక్కువ టిక్కెట్లు ముందస్తుగా బుక్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను కలుపుకుంటే తొలిరోజే 2.79 లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి.
ఆదివారం (డిసెంబర్ 0) కేరళలో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఓపెనింగ్ అయిన వెంటనే ప్రధాన థియేటర్లలో టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఆంధ్రాలో టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఓపెన్ కాలేదు. ఒకసారి అక్కడ కూడా టికెట్ బుకింగ్ ఓపెన్ అయితే ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. కొన్ని నివేదికల ప్రకారం, ఇప్పటి వరకు కేవలం ఒక రోజు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ద్వారా 15 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని సమాచారం. సినిమా విడుదలకు మరో నాలుగు రోజలు సమయం ఉంది. కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్ల ద్వారానే దాదాపు వంద కోట్ల కలెక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అమెరికాలో ‘పుష్ప 2’ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఉత్తర అమెరికాలోనే ఇప్పటివరకు రూ.16 కోట్ల టిక్కెట్లు అడ్వాన్స్‌గా బుక్ అయ్యాయి. ఇక డిసెంబర్ 04న ఉత్తర అమెరికాలో ఈ సినిమా విడుదల కానుంది. డిసెంబర్ 05న ఈ సినిమా ఇండియాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలంగాణలో కూడా డిసెంబర్ 04 న పుష్ప 2 బెనిఫిట్ షోస్ పడనున్నాయి.
సోమవారం హైదరాబాద్ లో పుష్పగాడి వైల్డ్ ఫైర్ జాతర..
After celebrating THE BIGGEST INDIAN FILM across the nation, it’s time to bring that euphoria home ❤🔥 #Pushpa2WildfireJAAthara in HYDERABAD on December 2nd from 6 PM onwards 💥💥 Venue : Police Grounds, Yousufguda #Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th
Icon Star… pic.twitter.com/JZWuR9rvru
— Pushpa (@PushpaMovie) November 30, 2024
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.