- Telugu News Photo Gallery Cinema photos Hero Vijay Deverakonda Beast Mode On with VD12 and VD13 movie shooting, Details Here
Vijay Deverakonda: బీస్ట్ మోడ్ ఆన్ అంటున్న విజయ్ దేవరకొండ.! వరసగా 3 లైన్లో..
కథ నచ్చితే.. కెప్టెన్ చెప్పిన కేరక్టర్‌లో ఒదిగిపోవాలని ఫిక్స్ అయితే యాక్టివిటీ రింగ్స్ అన్నీ కలర్‌ఫుల్ సర్కిల్స్ లో కనిపించేస్తాయి. మైండ్‌లో ఒక్కసారి ఫిక్స్ అయినప్పుడు చేసే ఎక్సర్‌సైజులు కూడా అలాగే ఉంటాయి మరి.. రెండున్నర గంటల పాటు స్క్రీన్ మీద ప్రేక్షకులను మెప్పించడానికి విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో తెలుసా.? ఫ్యామిలీస్టార్‌లో స్క్రీన్ మీద పక్కింటబ్బాయిలా హాయిగా కనిపించారు విజయ్ దేవరకొండ.
Updated on: Dec 03, 2024 | 3:06 PM

ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు రౌడీ బాయ్. అందుకే ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారీయన.

రెండున్నర గంటల పాటు స్క్రీన్ మీద ప్రేక్షకులను మెప్పించడానికి విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో తెలుసా.? ఫ్యామిలీస్టార్‌లో స్క్రీన్ మీద పక్కింటబ్బాయిలా హాయిగా కనిపించారు విజయ్ దేవరకొండ.

ఇందులో పోలీస్‌గా నటిస్తున్నారు విజయ్. ఈ సినిమా పూర్తయ్యాకే రవికిరణ్ కోలా, రాహుల్ సంక్రీత్యన్ సినిమాలు సెట్స్‌పైకి రానున్నాయి. వీటిలో రవికిరణ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. రాహుల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ టేకప్ చేస్తున్నారు. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ విజయ్‌లో గట్టి మార్పునే తీసుకొచ్చింది.

అందుకే ఖుషీ ఖుషీగా ఉండకుండా.. కాస్త సమయాన్ని కేటాయించి ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ని కంటిన్యూ చేస్తున్నారు. విజయ్ కెరీర్‌లో సిక్స్ ప్యాక్ చేసి, బీస్ట్ మోడ్ ఆన్ అంటూ స్క్రీన్ మీద అద్భుతంగా కనిపించారు లైగర్ మూవీలో.

పెళ్లిచూపులు సినిమాలో కనిపించిన పక్కింటబ్బాయి, అర్జున్‌రెడ్డిలో నటించిన అతను.. లైగర్‌లో కనిపిస్తున్న ఇతను.. ఒకరేనా? అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.

విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఎవరి దిష్టో బాగా బలంగా తగిలేసింది. అప్పట్లో వరస విజయాలతో రయ్‌మంటూ దూసుకొచ్చిన రౌడీ బాయ్‌కు ఈ మధ్య కాలం అస్సలు కలిసిరావడం లేదు.

సెట్స్‌పై ఉన్న సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు..? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..?




