- Telugu News Photo Gallery Cinema photos One Year for Sandeep Reddy Vanga animal movie starrer ranbir kapoor and rashmika mandanna
Animal: ఏడాది క్రితం యానిమల్ దెబ్బకి థియేటర్స్ షేక్.! సందీప్ రెడ్డి వంగా మార్క్ సెట్..
సినిమా సక్సెస్ అంటే ఎలా ఉండాలంటే, సినిమా రిలీజ్‌కి ముందు మాత్రమే కాదు, సినిమా రిలీజ్ అయి ఏడాది అయినా ఆ మూవీ మేనియా కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉండాలి. అందరి మాటలూ వింటున్నప్పుడు నిన్నా మొన్ననే కదా.,. సినిమా రిలీజ్ అయిందన్నంత ఫ్రెష్‌గా అనిపిస్తుండాలి. అంతలోనే యానివర్శరీని సెలబ్రేట్ చేసేసుకోవాలి.. ఇప్పుడు యానిమల్ మూవీ చేసిందదే.
Updated on: Dec 03, 2024 | 2:47 PM

సినిమా సక్సెస్ అంటే ఎలా ఉండాలంటే, సినిమా రిలీజ్‌కి ముందు మాత్రమే కాదు, సినిమా రిలీజ్ అయి ఏడాది అయినా ఆ మూవీ మేనియా కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉండాలి.

అందరి మాటలూ వింటున్నప్పుడు నిన్నా మొన్ననే కదా.,. సినిమా రిలీజ్ అయిందన్నంత ఫ్రెష్‌గా అనిపిస్తుండాలి. అంతలోనే యానివర్శరీని సెలబ్రేట్ చేసేసుకోవాలి.. ఇప్పుడు యానిమల్ మూవీ చేసిందదే.

యానిమల్ సినిమా రిలీజ్ అయి ఏడాది కంప్లీట్ అయిన సందర్భంగా సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటోంది యూనిట్. వార్షికోత్సవం గిఫ్ట్ గా స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. సినిమా మొత్తాన్ని ఓ సారి రివైండ్ చేస్తున్నట్టుంది ఆ వీడియో.

సౌత్ నుంచి నార్త్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీస్ అక్కడ కమర్షియల్ ఇమేజ్ తెచ్చుకున్న దాఖలాలు ఇంత వరకు లేవు.

డిసెంబర్ నెల తనకెంతో స్పెషల్ అని అన్నారు. ఆమె నటించిన పుష్ప, యానిమల్, ఇప్పుడు పుష్ప2 డిసెంబర్‌లోనే విడుదలవుతుండటాన్ని గురించి ఇన్‌స్టంట్ డిస్కషన్ మొదలైంది సోషల్ మీడియాలో. ఈ సినిమా గురించి స్పెషల్‌గా మెన్షన్ చేశారు బాబీ డియోల్.

ఒక్కసారిగా ప్యాన్ ఇండియా రేంజ్ లో పేరు తెచ్చుకున్నారు బాబీ డియోల్. నార్త్ లోనే కాదు, సౌత్‌లోనూ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు బాబీ డియోల్. ఆయన కేరక్టర్‌ని సందీప్ రెడ్డి వంగా డిజైన్ చేసిన తీరుకు ఇంకా ఫిదా అవుతున్నారు జనాలు.

యూనిట్ అంతా సెలబ్రేషన్ మోడ్‌లో ఉంటే, ఫ్యాన్స్ మాత్రం యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ తనతో ఈ పాయింట్ గురించి డిస్కస్ చేసినట్టు ఆ మధ్య చెప్పేశారు రష్మిక మందన్న. ఇప్పుడు స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా... నెక్స్ట్ యానిమల్ పార్క్ పనులు స్టార్ట్ చేస్తారు.




