- Telugu News Photo Gallery Cinema photos Tamanna bhatia interesting comments on jailer movie Kaavaalaa song
ఆ పాటకు ఇంకా బాగా డాన్స్ చేయాల్సింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన మిల్కీ బ్యూటీ
నటి తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నటి తమన్నా మాట్లాడుతూ, స్త్రీ 2 విజయానికి కారణం ఆజ్ కీ రాత్ పాట అని అన్నారు. కానీ రజనీకాంత్ జైలర్‌లో చేసిన కావలా పాటకు నేను పూర్తి సహకారం అందించనందుకు చింతిస్తున్నాను అని తమన్నా తెలిపింది.
Updated on: Dec 03, 2024 | 1:58 PM

అలాగని తనపై ఐటం గాళ్ ముద్ర వేస్తే మాత్రం ఒప్పుకోనంటున్నారు తమన్నా. కొన్నిసార్లు స్నేహం కోసం స్పెషల్ సాంగ్స్ చేస్తానంటున్నారు ఈ బ్యూటీ. అంతే గానీ తాను ఐటం గాళ్ కాదనేది ఈమె వాదన.

2005లో, తమన్నా మార్చి 4న విడుదలైన హిందీ చిత్రం చంత్సా రోషన్ షెహ్రాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా హ్యాపీ డేస్ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది.

ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాగే తక్కువ సమయంలోనే తెలుగులో యంగ్ హీరోతో పాటు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే హీరోయిన్ గా చేస్తూనే స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టింది తమన్నా.

జైలర్, సరిలేరు నీకెవ్వరు, స్త్రీ 2, జై లవకుశ, కేజియఫ్.. లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసారు తమన్నా. తమన్నా స్పెషల్ సాంగ్‌కు అదిరిపోయే క్రేజ్ ఉందిప్పుడు.

డాన్సుల విషయంలో స్త్రీ 2 సాంగ్ చేసినప్పుడు చాలా తృప్తిగా అనిపించింది. జైలర్ సినిమాలో చేసిన నువ్వు కావాలయ్యా సాంగ్ కి అన్యాయం చేశానేమో అనిపిస్తుంది ఆ సాంగ్ కి ఇంకా డాన్స్ బాగా చెయ్యొచ్చు అనిపించింది అని తమన్నా చెప్పుకొచ్చింది.




