- Telugu News Photo Gallery Cinema photos Heroine Tamanna Bhatia series on someone's call item girl, Details Here
Tamannaah Bhatia: ఎవరు ఐటం గాళ్.. తమన్నా వార్నింగ్.! తెలియకుండానే ముద్ర పడిందా.!
చెప్పేవేమో శ్రీరంగనీతులు.. చేసేవేమో..! అ..ఆ.. మనకెందుకులెండీ ఆ మాటలు గానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మ్యాటర్‌కు ఈ సామెతకు సంబంధమైతే ఉందండోయ్..! ఒక్క స్పెషల్ సాంగ్ చేస్తేనే ఆ హీరోయిన్‌పై ఐటం గాళ్ ముద్ర వేస్తున్న రోజులివి. అలాంటిది అరడజన్‌కు పైగానే స్పెషల్ సాంగ్స్ చేసి నేను ఐటం గాళ్ కాదంటే ఎలా.? ఇంతకీ ఎవరంటున్నారలా అనుకుంటున్నారా..?
Updated on: Dec 03, 2024 | 2:04 PM

చెప్పేవేమో శ్రీరంగనీతులు.. చేసేవేమో..! అ..ఆ.. మనకెందుకులెండీ ఆ మాటలు గానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మ్యాటర్‌కు ఈ సామెతకు సంబంధమైతే ఉందండోయ్..!

ఒక్క స్పెషల్ సాంగ్ చేస్తేనే ఆ హీరోయిన్‌పై ఐటం గాళ్ ముద్ర వేస్తున్న రోజులివి. అలాంటిది అరడజన్‌కు పైగానే స్పెషల్ సాంగ్స్ చేసి నేను ఐటం గాళ్ కాదంటే ఎలా.? ఇంతకీ ఎవరంటున్నారలా అనుకుంటున్నారా..?

ఇండస్ట్రీలో తెలియకుండానే కొందరు హీరోయిన్లపై ఐటం గాళ్ ముద్ర పడిపోతుంది.హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ.. మధ్య మధ్యలో స్పెషల్ సాంగ్స్ చేస్తే ఓకే గానీ.. కేవలం వాటిపైనే ఫోకస్ చేస్తే మాత్రం సమస్యలు తప్పవు.

తాజాగా తమన్నాకు ఇలాంటి ఇష్యూసే వస్తున్నాయి. నేను హీరోయిన్‌రా బాబూ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ బ్యూటీకి పాపం. తమన్నాను హీరోయిన్ కాదన్నదెవరిప్పుడు అని ఆలోచిస్తున్నారా..?

అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ మధ్య ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ. పైగా ఈమె చిందేస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా బాగా నడుస్తుంది.

జైలర్, సరిలేరు నీకెవ్వరు, స్త్రీ 2, జై లవకుశ, కేజియఫ్.. లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసారు తమన్నా. తమన్నా స్పెషల్ సాంగ్‌కు అదిరిపోయే క్రేజ్ ఉందిప్పుడు.

దాంతో ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు మేకర్స్. ఇక్కడే మిల్కీ బ్యూటీకి కోపం వచ్చేసింది. తాను చేసిన పాటలు సినిమాలకు హెల్ప్ అయితే హ్యాపీయే గానీ..

అలాగని తనపై ఐటం గాళ్ ముద్ర వేస్తే మాత్రం ఒప్పుకోనంటున్నారు తమన్నా. కొన్నిసార్లు స్నేహం కోసం స్పెషల్ సాంగ్స్ చేస్తానంటున్నారు ఈ బ్యూటీ. అంతే గానీ తాను ఐటం గాళ్ కాదనేది ఈమె వాదన.




